News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Tremendous Response To Warrior Movie Teaser

Warrior Teaser: ‘ది వారియర్’ మూవీ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్

సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ నటిస్తున్న సినిమా 'ది వారియర్'.

  • By Hashtag U Published Date - 07:28 PM, Sat - 14 May 22
Warrior Teaser: ‘ది వారియర్’ మూవీ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్

సత్య… సత్య ఐపీఎస్!
డిప్యూటీ సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్.
ఆయన అంటే రౌడీలకు హడల్, గుండాలకు గుబుల్.
వయలెంట్‌గా కొడతాడు! వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు!
అతడి కథేంటో తెలియాలంటే… ముందు ‘ది వారియర్’ టీజర్ చూడాల్సిందే.

సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ నటిస్తున్న సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. మే 15న రామ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.

‘ది వారియర్’ టీజర్‌లో హీరో రామ్ క్యారెక్టర్‌తో పాటు విలన్ రోల్ చేస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ కృతి శెట్టి, నదియా క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ ఫెరోషియస్ యాక్టింగ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ సూపర్బ్ అని చెప్పాలి. హీరోను లింగుస్వామి బాగా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండ‌ర్డ్స్‌లో ఉన్నాయి.

‘ఈ పోలీసోళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాం అప్ప! ఇంతకు ముందు సైలెంట్‌గా ఉండేటోళ్ళు. ఇప్పుడు వైలెంట్‌గా లోపలేస్తాండారు. ఈ మధ్య సత్య అని ఒకడు వ‌చ్చున్నాడు… వాడియమ్మా! ఒక్కొక్కడికి పెడుతున్నాడు. కానీ, ఒకటప్పా… కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు. అట్టా కొడతాడు… టాబ్లెట్ ఇస్తాడు’ అని నటుడు రిడిన్ కింగ్‌స్లే చెబుతుంటే… స్క్రీన్ మీద పవర్‌ఫుల్‌గా రామ్ ఎంట్రీ ఇచ్చారు. టీజర్‌లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.

యాక్షన్ మాత్రమే కాదు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు టీజర్‌లో చోటు ఇచ్చారు. ‘డిప్యూటీ సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్ సత్య పోరీని నేను’ అని కృతి శెట్టి చెప్పడమే కాదు, రామ్‌తో రొమాన్స్ చేయడమూ చూపించారు. ‘ఆట బానే ఉంది, ఆడేద్దాం’ అంటూ ఆది పినిశెట్టి చెప్పడం, ఆయన గెటప్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశాయి.

‘పాన్ ఇండియా సినిమా చూసుంటారు. పాన్ ఇండియా రౌడీస్‌ను చూశారా?’, ‘మై డియర్ గ్యాంగ్‌స్ట‌ర్స్‌ వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్’ అంటూ రామ్ చెప్పే డైలాగులు సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.

‘ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చినవాళ్ళను కొట్టడం కాదు, వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం’ అని హీరో రామ్‌తో నదియా ఒక మాట చెబుతారు. అందులో ఎమోషన్, ఫైర్… రెండూ ఉన్నాయి. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో హీరో ఏం చేశాడు? ఎవరిని వెతుక్కుంటూ వెళ్లి కొట్టాడు? అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

మాస్… ఊర మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుందని టీజర్ చెప్పకనే చెప్పింది. యాక్షన్ ప్రియులను మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉన్నాయని రామ్, నదియా సీన్ చూస్తే అర్థం అయ్యింది. విడుదలైన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో ‘ది వారియర్’ టీజర్ వైరల్ అయ్యింది.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. స్క్రీన్ మీద రామ్, స్క్రీన్ వెనుక లింగుస్వామి అద్భుతంగా చేశారు. ఊర మాస్ విజువల్ గ్రాండియర్ అని ఆడియన్స్ చెబుతుంటే సంతోషంగా ఉంది. వాళ్ళ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. ఒక్క పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆ పాటను ఈ నెల 22 నుంచి హైదరాబాద్‌లో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తాం” అని చెప్పారు.

అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: విజయ్ మాస్టర్ & అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా – లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్, స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌, నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుస్వామి.

Tags  

  • adi pinishetty
  • kriti shetty
  • ram
  • warrior movie
  • warrior teaser

Related News

The Warrior: మహాశివరాత్రి సందర్భంగా ‘ది వారియర్’లో ‘గురు’గా ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ విడుదల

The Warrior: మహాశివరాత్రి సందర్భంగా ‘ది వారియర్’లో ‘గురు’గా ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ విడుదల

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊర మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'ది వారియర్'. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

  • #Ravishing Krithi Shetty in red tradition attire(Shyam Singha Roy) 14

    #Ravishing Krithi Shetty in red tradition attire(Shyam Singha Roy)

  • Pushpa:పుష్పకి మన్యంపులికీ సంబంధం.. అసలు కథేంటీ..?

    Pushpa:పుష్పకి మన్యంపులికీ సంబంధం.. అసలు కథేంటీ..?

Latest News

  • Tamannaah Beauty Secret: మిల్కీ బ్యూటీ తమన్నా స్కిన్ మెరుపు సీక్రెట్ ఇదే…మీరు ఫాలో అయిపోండి…

  • Summer Health Drink: మజ్జిగలో త్రిఫల చూర్ణం కలిపి తాగితే ప్రయోజనాలు ఇవే..వేసవిలో అద్భుతమైన డ్రింక్…

  • Lakshmi Puja: మే 20 జ్యేష్ఠ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..అప్పులు తీరి, సకల సంపదలు చేకూరుతాయి…

  • Hyderabad Beats Mumbai: థ్రిల్లింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం.. ముంబై చిత్తు!!

  • Angry Bride: వికటించిన డీజే, ముహూర్తానికి మండపం చేరుకోని వరుడు, కోపం మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న వధువు…

Trending

    • Tomato Prices: టమాట.. తినేటట్టు లేదు!

    • Skyfall in Gujarat: గుజరాత్ లో ‘లోహపు’ బంతుల వర్షం.. రంగంలోకి ఇస్రో!

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: