Krishna Hospitalised: సూపర్ స్టార్ కృష్ణ కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
టాలీవుడ్ సూపర్ స్టార్, సీనియర్ నటుడు కృష్ణ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. నటుడు కృష్ణ అస్వస్థతకు గురికావడంతో
- By Balu J Published Date - 11:14 AM, Mon - 14 November 22

టాలీవుడ్ సూపర్ స్టార్, సీనియర్ నటుడు కృష్ణ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. నటుడు కృష్ణ అస్వస్థతకు గురికావడంతో వెంటనే అతన్ని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో సూపర్ స్టార్ బాధపడుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నటుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో మహేష్ బాబు ఆసుపత్రిని సందర్శించనున్నట్టు సమాచారం. కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కొద్దిరోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే, ఈ ఘటన నటుడిని కృంగదీసిందని అంటున్నారు కుటుంబ సభ్యులు.