Bandla Ganesh Bhajana: ‘బండ్ల భజన’తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బేజారు!
టాలీవుడ్ లో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఒకరు.
- By Balu J Published Date - 11:43 AM, Wed - 14 September 22

టాలీవుడ్ లో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఒకరు. ఏమాత్రం సమయం దొరికినా పవన్ పై ఆసక్తికర కామెంట్స్ చేస్తూ.. తనకు మించిన అభిమాని మరొకరు ఉండరు అని చాటుకుంటాడు. పవన్ కళ్యాణ్ స్వయం ప్రకటిత భక్తుడిగా పేరున్న బండ్ల గణేష్, తన దేవుడిపై ప్రశంసల వర్షం కురిపించడానికి ఏ సందర్భాన్ని కూడా వదలడు. ఈ పరిస్థితి ‘అక్కడ స్పేస్ లేదు కానీ తీసుకున్నాడు.’ అనే త్రివిక్రమ్ చెప్పిన ఫేమస్ డైలాగ్‌ని గుర్తుకు తెస్తుంది. అనవసరమైన పరిస్థితుల్లో కూడా బండ్ల గణేష్ పవన్ టాపిక్ ను తీసుకొస్తుండటంతో ఏమాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఇటీవల శాకిని-డాకిని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అటెండ్ అయిన అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డల చిత్రాలను పోస్ట్ చేసాడు.
ఇతరులపై ఎటువంటి వినయం, గౌరవం లేకుండా కూర్చున్నందుకు యువ హీరోలను టార్గెట్ చేశాడు పబ్లిక్ ఫంక్షన్ లో ఇలా వ్యవహరిస్తారా అంటూ ఇన్ డెరక్ట్ గా సెటైర్స్ వేశాడు. అక్కడితో ఆగిపోకుండా కాళ్లు, చేతులు ముడుచుకుని కూర్చున్న పవన్ కళ్యాణ్ ఫొటోలతో పోల్చాడు. యువ హీరోలు పబ్లిక్ ఈవెంట్‌లలో ఎలా ప్రవర్తించాలో పవన్ కళ్యాణ్ నుండి క్రమశిక్షణ నేర్చుకోవాలని కోరాడు. వెంటనే ఇతర హీరోలు అభిమానులు పవన్ కాళ్ళు చాచి రిలాక్డ్స్ గా మూడ్‌లో కూర్చున్న ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్‌పై తాను చేసిన భజన పవన్ కళ్యాణ్‌కి, అతని అభిమానులకు ఇబ్బందిని కలిగిస్తోందన్న వాస్తవాన్ని బండ్ల గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది.
https://twitter.com/ganeshbandla/status/1569724284423254016?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1569724284423254016%7Ctwgr%5Ea50d4050abde67dd21959d59fad6b184bcae6046%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.mirchi9.com%2Fmovienews%2Fbandla-ganesh-targets-young-heroes-with-pawan-kalyan-bhajana%2F