Tollywood: ఎండలు మండుతున్న తగ్గేదేలే అంటున్న హీరోలు.. భగభగ మండే ఎండల్లో కూడా షూటింగ్స్!
ఒకవైపు ఎండలో మండిపోతున్న కూడా ఆ హీరోలు మాత్రం సినిమా షూటింగ్లను ఆపడం లేదు. మరి ప్రస్తుతం ఏ సినిమాలో షూటింగ్లు జరుగుతున్నాయో తెలుసుకుందాం.
- By Anshu Published Date - 01:45 PM, Wed - 5 March 25

మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా పాట చిత్రీకరణ ప్రస్తుతం హేలో నేటివ్ స్టూడియోలో జరుగుతోంది. అక్కడే సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ హీరోగా ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న షూట్ కూడా జరుగుతోంది. అదేవిధంగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమాతో పాటు సంపత్ నంది, శర్వానంద్ సినిమాల సెట్ వర్క్ ఇదే స్టూడియోలో జరుగతున్నాయి. ప్రభాస్ ఇటు రాజా సాబ్ అటు ఫౌజీ సినిమాలకు డేట్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్ డమ్ చిత్ర షూటింగ్ పఠాన్ చెరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా, రామ్ పోతినేని, మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా షూట్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటిగట్టు లోని కీలక సన్నివేశాల చిత్రీకరణ తుక్కుగూడలో జరుగుతోంది. నిఖిల్ పీరియడ్ వార్ డ్రామా స్వయంభూ షూట్ జన్వాడలో, తేజా సజ్జా మిరాయ్ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో, సుధా కొంగర తెరకెక్కిస్తున్న తమిళ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇలా వేసవిలో ఎండలు మండిపోతున్న కూడా మన హీరోలు మాత్రం షూటింగ్ ఆపడం లేదు.