Tollywood Hero Revealed in Jai Hanuman : ప్రశాంత్ వర్మ ఇలా దొరికిపోతాడు అనుకోలేదు.. జై హనుమాన్ లో ఆ టాలీవుడ్ హీరో ఫిక్స్..!
Tollywood Hero Revealed in Jai Hanuman హనుమాన్ సక్సెస్ తో సూపర్ జోష్ లో ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు.
- By Ramesh Published Date - 04:17 PM, Wed - 24 January 24

Tollywood Hero Revealed in Jai Hanuman హనుమాన్ సక్సెస్ తో సూపర్ జోష్ లో ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. రిలీజ్ ముందు హనుమాన్ పై తానొక్కడినే సూపర్ కాన్ ఫిడెంట్ గా కనిపించగా సినిమా చూశాక ప్రశాంత్ వర్మ టాలెంట్ ఏంటన్నది ఆడియన్స్ అందరికీ అర్ధమైంది.
We’re now on WhatsApp : Click to Join
హనుమాన్ సినిమా క్లైమాక్స్ సీన్స్ అన్ని ఆడియన్స్ అందరికీ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ గా అనిపించాయి. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాగా హనుమాన్ క్రేజ్ తెచ్చుకుంది.
అయితే జై హనుమాన్ సినిమాలో తేజా సజ్జ ఉండడు.. స్టార్ హీరో హనుమంతుడిగా కనిపిస్తాడని ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరా అని గెస్ చేయడం మొదలు పెట్టారు. కొందరు మాత్రం హనుమాన్ సినిమాలో కొద్దిసేపు కనిపించిన ఆ హనుమాన్ ఫోటోలను పరీక్షించి చూస్తున్నారు. అలా చూడటం వల్ల వారికి ఒక క్లూ దొర్కింది.
ఆ ఫోటోలను క్లోజ్ గా చూస్తే హనుమాన్ కళ్లు కనిపిస్తున్నాయి. అయితే అవి మన రానా దగ్గుబాటి కళ్లలా ఉన్నాయి. సో జై హనుమాన్ లో హనుమాన్ గా కనిపించేది మన హ్యాండ్సం టాలీవుడ్ హల్క్ రానానే అని అంటున్నారు.
ఈ గెస్సింగ్ ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియదు కానీ రానా జై హనుమాన్ లో నటిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆల్రెడీ రానా హిరణ్యకశ్యప అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సో హనుమాన్ గా కూడా చేస్తే ఆ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.