Nikhil Siddhartha : జనసేన జెండా పట్టిన హీరో నిఖిల్.. వీడియో వైరల్..
జనసేన జెండా పట్టి జనసైనికులను ఉత్సాహపరిచిన హీరో నిఖిల్. వైరల్ అవుతున్న వీడియో.
- Author : News Desk
Date : 29-04-2024 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
Nikhil Siddhartha : ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో టాలీవుడ్ స్టార్స్ సందడి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. చిరంజీవి వంటి బడా స్టార్స్ నుంచి నిఖిల్ వంటి యంగ్ హీరో వరకు ఏపీ ఎన్నికల ప్రచారాల్లో భాగం అవుతూ సందడి చేస్తున్నారు. నిఖిల్ కి ఏపీ ఎన్నికలకు సంబంధం ఏంటంటే.. తన సోదరి మావయ్య అయిన మాలకొండయ్య యాదవ్ టీడీపీ తరుపు నుంచి చీరాలలో పోటీ చేస్తున్నారు. ఇక తన సోదరి కుటుంబం కోసం, తనకి వరుసయ్యే మావయ్య కోసం నిఖిల్.. ప్రచారంలోకి దిగి మావయ్య గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా చీరాల నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ వస్తున్న నిఖిల్.. తాజాగా జనసేన జెండా పట్టుకొని జనసైనికులను ఖుషి చేసారు. ప్రస్తుతం జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో నిఖిల్ కాంపెయిన్ లో టీడీపీ కార్యకర్తలతో పాటు జనసైనికులు కూడా పాల్గొన్నారు. దీంతో వారిని ఉత్సాహపరిచేందుకు నిఖిల్.. జనసేన జెండా పట్టి రెపరెపలాడిస్తూ సందడి చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Annoi @actor_Nikhil eww 🔥💯 pic.twitter.com/xsqn8XgUSm
— Legend PawanKalyan FC™ (@Legend_PSPK) April 28, 2024
ఇక ఈ ఎన్నికల్లో కనిపించబోయే మరికొంతమంది స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే.. చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ కోసం వచ్చి ప్రచారం చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే దీని పై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కాగా వరుణ్ తేజ్ ఆల్రెడీ పవన్ కోసం ప్రచారం చేసి సందడి చేసారు. త్వరలో సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా రాబోతున్నారు. అలాగే టీడీపీ కోసం నారా రోహిత్ కూడా రానున్నారు. వీరితో పాటు రామ్ చరణ్ కూడా ఏపీ ప్రచారాల్లో కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే దాని పై కూడా సరైన సమాచారం లేదు.
Also read : Chiranjeevi : చిరంజీవి ప్రచారానికి రాబోతున్నారు.. నటుడు పృథ్వీ కామెంట్స్..