Celebrities Deaths: టాలీవుడ్ దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ మృతి
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ మృతి చెందారు. 49 సంవత్సరాల వయసున్న ఎన్ఎస్ఆర్ ప్రసాద్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు.
- By Praveen Aluthuru Published Date - 05:14 PM, Sat - 29 July 23

Celebrities Deaths: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ మృతి చెందారు. 49 సంవత్సరాల వయసున్న ఎన్ఎస్ఆర్ ప్రసాద్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో కన్నుమూశారు. ఎన్ఎస్ఆర్ ప్రసాద్ అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ నటించిన నిరీక్షణ చిత్రానికి దర్శకుడు. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంతో ఎన్ఎస్ఆర్ ప్రసాద్ దర్శకుడిగా మారారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాటలు చాలా అద్భుతంగ ఉంటాయి. శ్రీకాంత్ నటించిన శత్రువు, నవదీప్ ‘నటుడు’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్ఎస్ఆర్ ప్రసాద్ చివరి చిత్రం ‘రెక్కీ విడుదలకు రెడీగా ఉంది. ఎన్ఎస్ఆర్ ప్రసాద్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం. ఎన్ఎస్ఆర్ ప్రసాద్ మృతి పట్ల సినీ పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేసింది.
Also Read: AP @ $243 : 2027నాటికి AP 20లక్షల కోట్లకు..అమరావతితో భేషుగ్గా.!SBI నివేదిక !!