Srikanth – Hema : రేవ్ పార్టీలో పట్టుబడినట్లు వస్తున్న వార్తలపై శ్రీకాంత్, హేమ రియాక్షన్..
ఈరోజు ఉదయం బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులు శ్రీకాంత్, హేమ పట్టుబడినట్లు వస్తున్న వార్తలపై వారు స్పదించారు.
- By News Desk Published Date - 04:40 PM, Mon - 20 May 24

Srikanth – Hema : ఈరోజు ఉదయం బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీ.. టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరిలో ఉన్న జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ అధికారులు ఆ పార్టీ పై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులకు.. ఎండీఎంఏ మాత్రలు, కొకైన్ పెద్దమొత్తంలో లభించినట్లు సమాచారం. ఇక ఈ పార్టీలో ఆంధ్రా, బెంగళూరుకి చెందిన దాదాపు 100 వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తుంది.
వీరిలో టాలీవుడ్ నటులు శ్రీకాంత్, హేమ కూడా ఉన్నారంటూ.. ఈరోజు ఉదయం నుంచి వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. శ్రీకాంత్ విషయంలో అయితే ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మీడియాకి కనిపించకుండా.. మొహం దాచుకుంటున్న ఓ వ్యక్తి చూడడానికి అచ్ఛం శ్రీకాంత్ లాగానే కనిపిస్తున్నాడు. దీంతో శ్రీకాంత్ కూడా ఆ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారని వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలతో టాలీవుడ్ లో గందరగోళం మొదలైంది. నిజంగానే హేమ, శ్రీకాంత్ రేవ్ పార్టీలో పాల్గొన్నారా..? అంటూ పలువురు వారికీ కాల్స్ చేసి కనుకుంటున్నారు.
Bangalore Rave Party lo RED HANDED ga dorikina #Janasena #JohnyMaster and other Janasena Tollywood artists….
— Sukkumarkk (@StrictlyAsking) May 20, 2024
దీంతో శ్రీకాంత్ అండ్ హేమ.. అసలు విషయం ఏంటో తెలియజేస్తూ వీడియో మెసేజ్ ని రిలీజ్ చేసారు. శ్రీకాంత్ తన ఇంటిలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి చూడడానికి తనలాగానే ఉన్నాడని, ఆ వీడియో చూసి తాను కూడా షాక్ అయ్యినట్లు చెప్పుకొచ్చారు. కాగా ఆ వీడియోలో కనిపించేది తాను కాదని, ఆ వార్తలు నమ్మకండి అంటూ వెల్లడించారు. ఇక హేమ కూడా హైదరాబాద్ లోనే ఉన్నట్లు చెప్పుకొస్తూ ఒక వీడియో రిలీజ్ చేసారు. తాను ఏ రేవ్ పార్టీలకు హాజరు కాలేదని చెప్పుకొచ్చారు.
రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని నేను కాదు.. తప్పుడు కథనాలను నమ్మకండి
– Actor #SrikanthMeka pic.twitter.com/Zv18qwLWUK
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) May 20, 2024
Actress #Hema dismisses reports that she was involved in a rave party in Bengaluru. Hema released a video and stated that she was not present at the party. #Bengaluru pic.twitter.com/KktEzv2119
— Telugucinema.com (@telugucinemacom) May 20, 2024