Nagarjuna Birthday Special : ‘హీరోగా పనికి రాడు’ అన్నవాళ్లకు.. నాగార్జున ఎలా ఆన్సర్ ఇచ్చారో తెలుసా ?
Nagarjuna Birthday Special : ఇవాళ (ఆగస్టు 29) హీరో నాగార్జున బర్త్ డే.. టాలీవుడ్ ‘కింగ్’ అభిమానులకు ఈరోజు పండుగ రోజు..
- By Pasha Published Date - 08:40 AM, Tue - 29 August 23
Nagarjuna Birthday Special : ఇవాళ (ఆగస్టు 29) హీరో నాగార్జున బర్త్ డే..
టాలీవుడ్ ‘కింగ్’ అభిమానులకు ఈరోజు పండుగ రోజు..
అక్కినేని ఫ్యామిలీకి ఇవాళ ఒక ఉత్సవం..
అక్కినేని నాగేశ్వర్ రావు నటవారసుడిగా మూవీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినా.. ట్యాలెంట్ తోనే పెద్ద ఎత్తులను అధిరోహించిన ఘనత నాగార్జున సొంతం.
ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చే నటులంతా నాగార్జునను రోల్ మోడల్ గా తీసుకొని మూవీ ఇండస్ట్రీలో మున్ముందుకు సాగుతున్నారు.
నాగార్జున బర్త్ డే వేళ.. కొత్త అప్ డేట్
బర్త్ డే వేళ నాగార్జున నుంచి ఇవాళ కొత్త అప్ డేట్ రాబోతోంది. చాలా రోజులుగా వార్తలకే పరిమితమైన Nagarjuna 99వ సినిమా ప్రాజెక్ట్ ని అధికారికంగా ఈరోజు నాగార్జున అనౌన్స్ చేయబోతున్నారు. ‘కింగ్ వస్తున్నాడు’ అంటూ సోమవారం రోజే నాగార్జున 99వ మూవీ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో నాగ్ సైకిల్, దాని మీద ఒక పెద్ద కత్తి, బ్యాక్ గ్రౌండ్ లో విలేజ్ సెటప్ కనిపిస్తోంది. నాగ్ ఈసారి ఊర మాస్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో చాలా ప్రోగ్రామ్స్ లో నాగార్జున లాంగ్ హెయిర్, రఫ్ గడ్డం మెయింటైన్ చేశారు. దీన్నిబట్టి.. నాగార్జున 99వ సినిమాలో ఆయన వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారనే తేటతెల్లం అవుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో ఈ సినిమా వస్తోంది. అయితే ఈ మూవీ డైరెక్టర్ ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈరోజు Nagarjuna 99 మూవీకి సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ మెంట్ చేయడంతో పాటు ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసి, కంటెంట్ ను రెడీగా పెట్టారని సమాచారం. నాగ్ 99వ సినిమాకు ‘గలాటా’ ‘భలే రంగడు’ అనే టైటిల్స్ ను పరిశీలించిన తర్వాత, ఫైనల్ గా ‘నా సామి రంగా’ అనే టైటిల్ కే నాగ్ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. వచ్చే సంక్రాంతి నాటికి ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఇక కింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ వేళ ‘మన్మథుడు’ చిత్రాన్ని 4K ఫార్మాట్ లో రీ రిలీజ్ చేస్తున్నారు.
నాగార్జున కెరీర్ హైలైట్స్ ఇవీ..
- నాగార్జున 1959 ఆగష్టు 29న చెన్నైలో (Nagarjuna Birthday Special) జన్మించారు. తండ్రి అక్కినేని నాగేశ్వర్ రావు వారసత్వాన్ని తొలి చిత్రానికే పరిమితం చేసుకున్న ఈ వైవిధ్య హీరో ‘విక్రమ్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీతోనే హీరోగా సక్సెస్ అందుకున్నారు.
- కెరీర్ మొదట్లో చాలా మంది నాగార్జున పర్సనాలిటీ హీరోగా పనికిరాదన్నారు. డైలాగ్ డెలివరీ బాగాలేదన్నారు. నాగ్ వారి మాటలకు తన నటనతో సమాధానం చెప్పారు. ఇతనేం హీరో అన్నవారిచేతనే.. హీరో అంటే ఇతనిలా ఉండాలనేలా స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు.
- భక్తికైనా..రక్తికైనా..క్లాస్ కైనా..మాస్ కైనా.. యాక్షన్ లో నాగార్జున ది బెస్ట్ అని నిరూపించుకున్నారు. అన్నిరకాల పాత్రలను సినీ జైత్రయాత్రను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
- నాగార్జున చైన్ పట్టుకుంటే మాస్ హీరోలా శివమెత్తగలడు. చేత్తో పువ్వు పట్టుకుంటే క్లాస్ హీరోగా ప్రేమను కురిపించగలడు. అన్నమయ్య గా భక్తి గీతాలు ఆలపించగలడు. శిరిడిసాయి గా మైమరిపించగలడు.. ఇవన్నీ నాగార్జునకు మాత్రమే సాధ్యం.
- నాగార్జున కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, స్టూడియో అధినేతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, టీవీ వ్యాఖ్యాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
- కెరీర్ తొలినాళ్లలో తండ్రి ఏఎన్నాఆర్ లా నాగార్జున ట్రాజెడీ కింగ్ గా పేరు గడించారు. అలనాటి దేవదాసును గుర్తుకుతెచ్చేలా దాసరి డైరెక్షన్ లో వచ్చిన మజ్ను నాగార్జునకు మంచిపేరే తీసుకొచ్చింది. ప్రేమ కథాంశంతో తెరకెక్కిన మజ్న నాగ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది.
- నాగార్జునకు యువతలో మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో క్రేజ్ తెచ్చిన మూవీ గీతాంజలి. మణిరత్నం తెలుగులో డైరెక్ట్ గా తీసిన ఒకే ఒక్క మూవీ గీతాంజలి కావడం విశేషం. ఈ సినిమా టెక్నికల్ గా తెలుగులో ఒక వండర్ క్రియేట్ చేసింది.
- నాగార్జునను సెన్సెషనల్ హీరోగా టర్న్ చేసిన మూవీ శివ. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం నాగ్ కెరీర్ నే కాకుండా… హోల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెబితే శివ ముందు శివ తరువాత అనేంతగా లాండ్ మార్క్ క్రియేట్ చేసింది.
- వారసుడు, అల్లరి అల్లుడు, హలో బ్రదర్, కింగ్ వంటి చిత్రాల్లో నాగార్జున తనదైన కామెడీ పంచ్ లతో అదరగొట్టారు.
- అన్నమయ్య చిత్రానికి నాగార్జున ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకోవడం విశేషం.
- అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాలతో అటు పాతతరాన్ని, ఇటు కొత్త తరాన్ని భక్తి సాగరంలో ఓలలాడించి ప్రేక్షకులని నాగార్జున ఆనంద పరవశులను చేశారు.
- అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు నాగార్జున అందించారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన నిన్నేపెళ్లాడతా, మన్మథుడు, మాస్, రాజన్న చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయ డమరుకం మోగించి ప్రొడ్యూసర్ గా నాగార్జున సత్తా చాటాయి.
Related News
Akkineni Nagarjuna: బాలీవుడ్ స్టార్ హీరోతో మన్మధుడు
నా సామిరంగ’ చిత్రంతో సంక్రాంతి బరిలో హిట్ కొట్టారు కింగ్ నాగార్జున. అయితే నా సామిరంగా' కంటే ముందు తమిళ దర్శకుడు చెప్పిన కథకు నాగ్ ఓకే చెప్పారు.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కథ ఓ మల్టీస్టారర్‌గా రూపొందనుందని టాక్.