Mytri Movie Makers : మైత్రి చేతిలో మూడు భారీ సినిమాలు..!
Mytri Movie Makers మైత్రి ప్రొడక్షన్స్ లో ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ సినిమా సెట్స్ మీద ఉంది. హను రాఘవపుడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా పై భారీ క్రేజ్ ఉంది. మరోపక్క రామ్ చరణ్ బుచ్చి బాబు
- By Ramesh Published Date - 11:23 PM, Tue - 4 February 25

Mytri Movie Makers : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ రీసెంట్ గా పుష్ప 2 తో 1800 కోట్లను కలెక్ట్ చేసింది. టాలీవుడ్ లోనే కాదు నేషనల్ వైడ్ గా ఏ సినిమా చేయని రికార్డులను పుష్ప 2 తో ఈ ప్రొడక్షన్ హౌస్ సాధించింది. ఐతే ఆ దూకుడు కొనసాగించేలా ఈ ప్రొడక్షన్ ఇప్పుడు మరో మూడు భారీ సినిమాలను లైన్ లో పెట్టింది.
మైత్రి ప్రొడక్షన్స్ లో ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ సినిమా సెట్స్ మీద ఉంది. హను రాఘవపుడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా పై భారీ క్రేజ్ ఉంది. మరోపక్క రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబోలో వస్తున్న సినిమా కూడా ఈ ప్రొడక్షన్ లోనే వస్తుంది.
ఈ రెండిటితో పాటు త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కూడా మైత్రి బ్యానర్ లోనే వస్తుంది. ఈ 3 సినిమాలు ఒక దానికి మించి మరొకటి అనిపించేలా ఉన్నాయి. ఈ మూడు సినిమాలతో మరోసారి తన బ్యానర్ పేరు పాన్ ఇండియా రేంజ్ లో హంగామా సృష్టించాలని చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చూస్తుంటే నేషనల్ లెవెల్ లో తమ ప్రొడక్షన్ రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకునేలా ఉన్నారు. పుష్ప 2 చివర్లో పుష్ప 3 కూడా వీళ్లు అనౌన్స్ చేశారు. ఈ 3 సినిమాలతో పాటు ఇంకా మరిన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.