The Soul Of Satya : మెగా హీరోను పెళ్లి చేసుకున్న కలర్ స్వాతి..
దేశభక్తి, దేశం కోసం ఫైట్ చేసే సైనికుడిగా సాయి తేజ్ (Sai Tej) ఈ షార్ట్ ఫిలిం లో
- By Sudheer Published Date - 03:29 PM, Wed - 9 August 23

టైటిల్ చూసి ఖంగారుపడకండి..జస్ట్ ఇది షార్ట్ ఫిలిం వరకు మాత్రమే. విరూపాక్ష , బ్రో సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ‘సత్య ‘ అనే షార్ట్ ఫిలిం తో ఆగస్టు 15 న అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఈ షార్ట్ ఫిలిం కు సంబదించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేసారు.
దేశభక్తి, దేశం కోసం ఫైట్ చేసే సైనికుడిగా సాయి తేజ్ (Sai Tej) ఈ షార్ట్ ఫిలిం లో కనిపించబోతున్నారు. సాయి కి భార్యగా.. కాలేజీ స్నేహితురాలిగా కలర్ స్వాతి నటించింది. సోల్ ఆఫ్ సత్య (The Soul Of Satya) పేరుతో విడుదల చేసిన టీజర్ లో సాయి తేజ్ , కలర్స్ స్వాతి (Swathi Reddy) పెళ్లి చేసుకోవడం, ప్రేమతో వెనుక నుంచి కౌగిలించుకుని ముద్దు పెట్టుకొనే సన్నివేశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యూజికల్ షార్ట్ లోని పాటను సింగర్ శృతి రంజని కంపోజ్ చేశారు.
మన దేశం కోసం పోరాటం చేసే ఎంతోమంది యోధులకు సంబంధించిన ఓ మంచి సందేశాన్ని తెలియజేయడానికి ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించారు. సాయి తో పాటు అతని స్నేహితులు హర్షిత్ రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ (Naveen VK) ఈ షార్ట్ ఫిలిం లో భాగస్వాములు అయ్యారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘బలగం’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ మ్యూజికల్ షార్ట్ ని నిర్మించగా.. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ ఫిలిం తో సింగర్ శృతి రంజన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారభించబోతున్నారు.
Read Also : Mukesh Ambani: ఏకంగా అన్ని రూ. కోట్లకు లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముఖేష్ అంబానీ?