HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >The Rana Daggubati Show Update

The Rana Daggubati Show : రానా టాక్ షో సెలబ్రెటీలు ఎవరో తెలుసా..?

The Rana Daggubati Show : హీరోలు నాని, నాగచైతన్య, సిద్ధు, తేజా సజ్జ, రిషబ్ శెట్టి, దుల్కర్ సల్మాన్.. హీరోయిన్లు ప్రియాంక మోహన్, శ్రీలీల, మీనాక్షి వంటి వారు గెస్టులు గా రాబోతున్నారు

  • Author : Sudheer Date : 15-11-2024 - 3:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rana Show
Rana Show

హీరో రానా (Rana) ‘ది రానా దగ్గుబాటి షో’ (The Rana Daggubati Show) సెలబ్రెటీ టాక్ షో నవంబర్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొనే సెలబ్రెటీలతో ట్రైలర్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. హీరోలు నాని, నాగచైతన్య, సిద్ధు, తేజా సజ్జ, రిషబ్ శెట్టి, దుల్కర్ సల్మాన్.. హీరోయిన్లు ప్రియాంక మోహన్, శ్రీలీల, మీనాక్షి వంటి వారు గెస్టులు గా రాబోతున్నారు. అలాగే డైరెక్టర్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా ఈ షోలో సందడి చేయనున్నారు.

షోలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, సరదా ముచ్చట్లు, అనుభవాలు, మరియు గేమ్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ షో నిర్వహణతో పాటు, సృష్టికర్త, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్ కూడా రానానే కావడం విశేషం. గతంలో ఈ టాక్ షో గురించి రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “సెలబ్రిటీల నిజ జీవితానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకునేందుకు మా షో ఓ ప్రత్యేక వేదిక కానుంది. ఇది ఓ టాక్‌ షో మాత్రమే కాదు. అంతకుమించి. షో కు రానున్న అతిథుల్లో చాలామంది నా స్నేహితులు, కో స్టార్స్ ఉన్నారు. వాళ్ల నుంచి ఎన్నో ఊహించని విషయాలు బయట పడతాయి” అని రానా చెప్పుకొచ్చారు.

ఇక రానా హోస్ట్ గా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన నెం.1యారి అనే టాక్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ టాక్​ షో మంచి ఆదరణను దక్కించుకుంది. టాలీవుడ్‌కు చెందిన చాలా మంది నటీ నటులు ఈ టాక్ షో కార్యక్రమంలో పాల్గొని, తమ సినిమా సంగతులతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరదా విషయాలు కూడా చెప్పడం జరిగింది.

ఇక రానా విషయానికి వస్తే..లీడర్ మూవీ తో వెండితెరకు హీరోగా పరిచమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన “బాహుబలి: ది బిగినింగ్” (2015) మరియు “బాహుబలి: ది కన్‌క్లూజన్” (2017) చిత్రాల్లో భల్లాలదేవ పాత్ర..రానాకు జాతీయ స్థాయి గుర్తింపును కలిగించింది. ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించిన..ఆయన క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు.

Read Also : Maharashtra Elections 2024: పవన్ కళ్యాణ్ కు బీజేపీ కీలక బాధ్యతలు.. రోడ్ మ్యాప్ ఇదే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amazon
  • nani
  • rajamouli
  • rana
  • Rana Show
  • rgv
  • The Rana Daggubati Show

Related News

Mahesh Babu Varanasi

Vaaranasi Movie: మైండ్ బ్లాక్ అయ్యేలా ‘వారణాసి’ ఓవర్సీస్ హక్కుల ధర !!

కేవలం ఓవర్సీస్ హక్కులే రూ. 160 కోట్లు అంటే, ఇక తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు, డిజిటల్ (OTT), మరియు శాటిలైట్ హక్కుల ధరలు ఊహకందని రీతిలో ఉండబోతున్నాయి

  • Amazon Electronics Premier

    Amazon : అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ స్టార్ట్

  • Amazon Layoffs

    అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు.. రోబోటిక్స్ ఉద్యోగులపై ప్రభావం

Latest News

  • కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

  • ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

  • రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd