Hero Heroine Affair : హీరోతో హీరోయిన్ ఏఫైర్.. ఇంట్లో తెలిసి హీరోయిన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హీరో భార్య!
స్టార్ హీరో (Hero) దర్శన్, పవిత్ర గౌడ సంబంధం తెరపైకి వచ్చింది. ఎందుకంటే పవిత్ర గౌడ దర్శన్ తో కలిసి తాను తీయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2024 - 12:32 IST
Published By : Hashtagu Telugu Desk
Hero Heroine Affair : కన్నడ చాలెంజింగ్ స్టార్, అభిమానులు ద బాస్ అని పిలుచుకునే అగ్ర నటుడు దర్శన్ వివాదాలలో ఇరుక్కున్నాడు. ఇటీవలే అతను నటించిన కాటేరా సినిమా 200 కోట్ల మార్కును దాటేసి 250 కోట్ల క్లబ్లో చేరటానికి పరుగులు తీస్తుంది. ఇటువంటి ఆనంద సమయంలోనే దర్శన్ ఫ్యామిలీలో గొడవలు భగ్గుమన్నాయి. దర్శన్ భార్య విజయలక్ష్మి మరొక నటి పవిత్ర గౌడ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇంతకీ ఏం జరిగిందంటే పవిత్ర గౌడ కొన్ని కన్నడ సినిమాలలో నటించింది. దర్శన్, పవిత్ర గౌడ ప్రేమలో ఉన్నారని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మళ్లీ ఈ స్టార్ హీరో (Hero) దర్శన్, పవిత్ర గౌడ సంబంధం తెరపైకి వచ్చింది. ఎందుకంటే పవిత్ర గౌడ దర్శన్ తో కలిసి తాను తీయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దానితోపాటు మా సంబంధం పూర్తయి 10 సంవత్సరాలు పూర్తయింది అనే క్యాప్షన్ పెట్టింది. ఇది దర్శన్ భార్య విజయలక్ష్మి కంట్లో పడటంతో వివాదాలు రచ్చ కెక్కాయి. ఇదే కాకుండా దర్శన్ 46వ పుట్టినరోజు సందర్భంగా ఒక రచ్చ జరిగింది. దర్శన్ పుట్టినరోజున పవిత్ర గౌడ ఆమె స్నేహితురాలు మేఘశెట్టితో సహా చాలామందితో జరుపుకుంది. దానిని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో పై దర్శన్ భార్య విజయలక్ష్మి వార్నింగ్ ఇచ్చింది.
ఆమె వార్నింగ్ ఇచ్చిన తరువాత పవిత్ర గౌడ నేరుగా దర్శన్ తో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. పదేళ్ల వాళ్ళ బంధాన్ని బయటపెట్టిన పవిత్ర గౌడ హీరో (Hero) దర్శన్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టినట్లు అయింది ఈ ఫోటోలు విషయంలో విజయలక్ష్మి భార్య మండిపడుతున్నారని తెలిసింది. గతంలో కూడా దర్శన్ హీరోయిన్ నిఖిత విషయంలో భార్య దగ్గర దొరికిపోయి ఆమె కోపానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read: Aloe Vera Juice: కలబంద జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? అవెంటో తెలుసుకోండి..!