Thammudu : జులై 04 న వస్తున్న ‘తమ్ముడు’
Thammudu : మొదటగా మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, అనుకోని కారణాలతో రిలీజ్ వాయిదా పడింది
- By Sudheer Published Date - 07:31 PM, Sun - 4 May 25

యంగ్ హీరో నితిన్ (Nithin) నటిస్తున్న తాజా చిత్రం “తమ్ముడు” (Thammudu) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నటి లయ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదటగా మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, అనుకోని కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. అయితే అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో తాజాగా జూలై 4న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 4న దర్శకుడు వేణు శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల తేదీని ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా విడుదల చేసిన రెండు పోస్టర్లు, ఓ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఓ పోస్టర్‌లో నితిన్ నోట్లో కత్తి పట్టుకొని, తీవ్రమైన లుక్‌లో కనిపిస్తుండగా, మరో పోస్టర్‌లో తమ్ముడు తన అక్కతో ఓ ప్రామిస్ చేస్తున్నట్టుగా భావోద్వేగాన్ని ఆవిష్కరించారు. బస్ మీద కూర్చున్న నితిన్ పోస్టర్‌కి కొత్త దృక్పథం తీసుకొచ్చింది. అంతే కాదు ఓ ఫన్నీ వీడియో కూడా షేర్ చేసి మరింతగా ఆకట్టుకున్నారు. వేణు తన బర్త్‌డే విషెస్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కానీ ఆఫీస్‌కి వచ్చిన లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ మాత్రం డైరెక్ట్‌గా సినిమా రిలీజ్ డేట్ గురించే మాట్లాడతారు. చివరికి దిల్ రాజు, శిరీష్ కలిసి ‘రారా కేక్ కట్ చెయ్’ అంటూ రిలీజ్ డేట్ ప్రింట్ చేసిన కేక్‌తో వేణు చేత కట్ చేయిస్తారు. ఈ వీడియో ద్వారా ప్రమోషన్స్‌కి వినూత్నంగా శ్రీకారం చుట్టిన టీం, సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడంలో విజయవంతమైంది.
Release Date Eppudu Sir?
Release Yavaga?
Release Yeppo?The wait is finally over for the team, audience, & everyone!🤩🎯
▶️ https://t.co/qEXY6ivpZS#HBDSriramVenu 🎉 #ThammuduOnJuly4th@actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya @VarshaBollamma #Swasika #DilRaju… pic.twitter.com/NZ4pvu9pWx
— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2025