Thaman : సోషల్ మీడియాలో విమర్శలు, గుంటూరు కారం సినిమా ఆలస్యంపై తమన్ కామెంట్స్..
తాజాగా తమన్ ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో బ్రో సినిమాతో పాటు సోషల్ మీడియాలో విమర్శలు, గుంటూరు కారం సినిమా ఆలస్యంపై మాట్లాడారు.
- Author : News Desk
Date : 10-07-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్(Music Directors) లో తమన్(Thaman) ఒకరు. ఇటీవల ఏ పెద్ద సినిమా తీసుకున్నా చాలా వరకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటున్నాడు. ప్రస్తుతం తమన్ చేతిలో దాదాపు డజన్ కి పైగా పెద్ద సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కాంబోలో తెరకెక్కుతున్న బ్రో(Bro) సినిమాకు కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా అంది బ్రో సినిమా. జులై 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్ ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో బ్రో సినిమాతో పాటు మరిన్ని విషయాలపై గురించి కూడా మాట్లాడారు. తమన్ చేసే సాంగ్స్ కాపీ అని, పాత పాటల నుంచి ట్యూన్స్ కొట్టేసి వాటిని మార్చి ఇస్తాడని సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో తమన్ పై విమర్శలు చాలానే వస్తాయి.
ఈ ఇంటర్వ్యూలో తనపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి మాట్లాడుతూ.. ట్రోల్స్ చూస్తూ ఉంటాను. అందులో మంచిని తీసుకుంటాను , చెడుని పక్కన పెట్టేస్తాను. ప్రశంసలు తీసుకున్నప్పుడు, విమర్శలు కూడా తీసుకోగలగాలి. నేను సంగీతం మీద ఎంత శ్రద్ధ పెడతానో, సంగీతం కోసం ఎంతో కష్టపడతానో మా దర్శక నిర్మాతలకు తెలుసు. కొందరేదో కావాలని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే, మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు.
ఇక ఇటీవల మహేష్ గుంటూరు కారం సినిమాపై అనేక వార్తలు వస్తున్నాయి. సినిమా ఆగిపోయిందని, కథ రెడీ అవ్వలేదని, పూజ హెగ్డే తప్పుకుందని, తమన్ కూడా తప్పుకున్నాడని.. ఇలా అనేక వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి. తమన్ ‘గుంటూరు కారం’ సినిమాపై వచ్చే వార్తల గురించి స్పందిస్తూ.. ఆరు నెలల నుంచి ఆ సినిమా మీద పని చేస్తున్నాం. బయట జరిగే అసత్య ప్రచారాలను పట్టించుకోకండి. ఏదైనా ఉంటే నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారు. కావాలని ఎవరూ ఫ్లాప్ సినిమాలు చేయరు. కొన్ని సార్లు సినిమా ఆలస్యమవ్వడం అనేది సహజం. దానిని భూతద్దంలో పెట్టి చూస్తూ పదే పదే దాని గురించి రాయాల్సిన అవసరంలేదు అని అన్నారు. దీంతో తమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇక బ్రో సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా అంటుందని, ఒరిజినల్ సినిమా కంటే కూడా ఇంకా బాగుంటుందని, సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయని, ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ చూసి డైరెక్టర్ సముద్రఖని నన్ను మెచ్చుకున్నారని తెలిపాడు.
Also Read : Jawan Teaser : జవాన్ టీజర్ చూశారా? అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు.. షారుఖ్ మరో భారీ హిట్ ఖాయం..