Pushpa 2 : ‘పుష్ప 2’ కోసం రంగంలోకి దిగిన థమన్
Thaman Pushpa 2 : ఈ చిత్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రంగంలోకి దిగినట్లు సినీవర్గాలు చెపుతున్నారు
- By Sudheer Published Date - 10:58 AM, Thu - 7 November 24

పుష్ప 2 (Pushpa 2) కోసం థమన్ (Thaman) రంగంలోకి దిగడం ఏంటి..? పుష్ప 2 కు దేవి శ్రీ (Devi Sri) కదా మ్యూజిక్ అందించేది..అలాంటిది థమన్ రావడం ఏంటి అనుకుంటున్నారా..? పుష్ప 2 మూవీ కి దేవిశ్రీ నే మ్యూజిక్ అందిస్తున్నాడు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం థమన్ అందించబోతున్నట్లు సమాచారం.
. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ (Allu Arjun) పేరే వినిపిస్తుంది.
ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 05 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ లోని ఐటెం సాంగ్ ను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నారు. పుష్ప లో ఐటెం సాంగ్ లో సమంత కనిపించగా..2 లో మాత్రం శ్రీ లీల కనిపించబోతుంది.
ఇదిలా ఉంటె ‘పుష్ప-2’ గురించి ఇంట్రెస్టింగ్ విషయం వైరలవుతోంది. ఈ చిత్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రంగంలోకి దిగినట్లు సినీవర్గాలు చెపుతున్నారు. ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయిందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సినిమాలోని సాంగ్స్ ను కంపోజ్ చేస్తుండగా..థమన్ మాత్రం బ్యాక్ గ్రౌండ్ ను అందిస్తున్నాడట. మరి దేవి ఎందుకు బ్యాక్ గ్రౌండ్ చేయలేకపోతున్నాడు..? నిజంగా థమన్ బీగం అందిస్తున్నాడా..? లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Kurnool to Vizag : కర్నూలు టు విశాఖపట్నం రైల్వే రూట్.. మూడు గంటల్లోనే అమరావతికి