Thalapathy Vijay : నీ దూకుడు సాటెవ్వరు.. ఆ కోలీవుడ్ స్టార్ ని చూసి నేర్చుకోండయ్యా..!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) సినిమాల ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ దసరాకి లియో అంటూ వచ్చి సందడి చేసిన విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు
- Author : Ramesh
Date : 28-01-2024 - 5:55 IST
Published By : Hashtagu Telugu Desk
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) సినిమాల ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ దసరాకి లియో అంటూ వచ్చి సందడి చేసిన విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో గోట్ సినిమా చేస్తున్నాడు.
We’re now on WhatsApp : Click to Join
లాస్ట్ ఇయర్ దసరా టైం లోనే అనౌన్స్ చేయడం సెట్స్ మీదకు వెళ్లడం జరిగిన ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం జూన్ లో రిలీజ్ ఉంటుందని టాక్.
కోలీవుడ్ లో సూపర్ స్టార్ డం ఉన్న విజయ్ తన ప్రతి సినిమాతో 200 కోట్లకు తగ్గకుండా వసూళ్లు రాబడుతున్నాడు. అలాంటి విజయ్ సింపుల్ గా ఏడు నెలల్లో ఒక సినిమా పూర్తి చేస్తున్నాడు. ఫ్యాన్స్ కి వరుస సినిమాలు ఇవ్వాలనే ఉద్దేశంతో విజయ్ ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా సినిమా స్టార్ట్ అవ్వడం ఆలస్యం పూర్తి చేసే వరకు స్ట్రాంగ్ గా ఉంటున్నాడు.
విజయ్ లాంటి స్టార్ హీరో ఇలా తక్కువ టైం లో సినిమా తీయడం ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. ఇక విజయ్ ని చూసి తెలుగు ఆడియన్స్ మన స్టార్స్ ఏడాది కాదు కదా రెండు ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. మరి విజయ్ ప్లానింగ్ తో తెలుగు స్టార్స్ కూడా అలా 8 నెలల్లో సినిమా పూర్తి చేస్తే మాత్రం ఆ రేంజ్ వేరేలా ఉంటుంది.
Also Read : Prabhas Kannappa : కన్నప్పకి డేట్స్ ఇచ్చిన ప్రభాస్.. మంచు విష్ణు ప్లానింగ్ అదే..!
విజయ్ గోట్ సినిమా తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత డివివి దానయ్య కూడా దళపతి విజయ్ తో సినిమా ఉంటుందని టాక్.