Thalapathi Vijay : దళపతి సినిమాలో ఆ హీరోయిన్ కూడా..?
Thalapathi Vijay దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో గోట్(G.O.A.T)సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
- Author : Ramesh
Date : 14-03-2024 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
Thalapathi Vijay దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో గోట్(G.O.A.T)సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ని చెన్నై చిన్నది త్రిష కొట్టేసిందని టాక్. లాస్ట్ ఇయర్ లియో సినిమాలో కూడా విజయ్ సరసన త్రిష నటించింది. మరోసారి ఈ ఇద్దరు జత కడుతున్నారు.
విజయ్ ఏజ్డ్ రోల్ పాత్రకు జోడీగా త్రిష కనిపిస్తుందని చెప్పొచ్చు. సౌత్ లో రెండు దశాబ్ధాల కెరీర్ తర్వాత కూడా త్రిష తన ఫాం కొనసాగిస్తుంది. తమిళంతో పాటుగా తెలుగులో కూడా త్రిష వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. ఇప్పటికే చిరు విశ్వంభర సినిమా ఛాన్స్ అందుకున్న త్రిష వెంకటేష్ అనీల్ రావిపుడి కాంబోలో మూవీ కి కూడా సైన్ చేసిందని టాక్.
వీటితో పాటుగా విజయ్ గోట్ సినిమాలో కూడా త్రిష ఓకే చేసింది. స్టార్ హీరోలకు త్రిష పర్ఫెక్ట్ ఆప్షన్ గా మారింది. అయితే ఇచ్చిన పాత్రల్లో ఆమె చేస్తున్న అభినయం కూడా త్రిషకు మళ్లీ మళ్లీ అవకాశాలు వచ్చేలా చేస్తుంది. తెలుగులో విశ్వంభర చేస్తుంది అనగానే అందరు దర్శక నిర్మాతలు త్రిష వెంట క్యూ కడుతున్నారు.
Also Read : Chiranjeevi Anudeep Kv : జాతిరత్నాలు డైరెక్టర్ తో మెగాస్టార్.. ఏం జరుగుతుంది..?