Thalaivar 171 : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా .. కాంబో అదిరిపోయిందిగా..
తాజాగా రజినీకాంత్ 171వ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ప్రకటించి అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
- Author : News Desk
Date : 11-09-2023 - 8:41 IST
Published By : Hashtagu Telugu Desk
రజినీకాంత్(Rajinikanth) ఇటీవలే జైలర్(Jailer) సినిమాతో దాదాపు 650 కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయం సాధించి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. రజినీకాంత్ 170వ సినిమా TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో త్వరలో మొదలవ్వనుంది. తాజాగా రజినీకాంత్ 171వ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ప్రకటించి అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
తమిళ్ లో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. లోకేష్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఖైదీ సినిమాతో కార్తీని కొత్తగా చూపించి సూపర్ హిట్ కొట్టి అనంతరం విజయ్ తో మాస్టర్ తీసి ఇటీవల కమల్ హాసన్ కి విక్రమ్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. విక్రమ్ సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం లోకేష్ విజయ్ తో లియో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
రజినీకాంత్ తో జైలర్ సినిమా నిర్మించిన సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ రజినీకాంత్ 171వ సినిమాని కూడా నిర్మిస్తుంది. ఇక లోకేష్ కనగరాజ్ – రజినీకాంత్ సినిమా ప్రకటించగానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించనున్నాడు. తలైవర్ 171వ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
We are happy to announce Superstar @rajinikanth’s #Thalaivar171
Written & Directed by @Dir_Lokesh
An @anirudhofficial musical
Action by @anbariv pic.twitter.com/fNGCUZq1xi
— Sun Pictures (@sunpictures) September 11, 2023
Also Read : Pushpa 2 Release Date: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, పుష్ప2 రిలీజ్ డేట్ ఫిక్స్!