Tollywood: ఏప్రిల్‌లో తెలుగు సినిమాల పండుగ.. రిలీజ్‌కు సిద్దమైన 10 సినిమాలు ఇవే!
టాలీవుడ్‌కు సంక్రాంతి పండుగ, సమ్మర్ సీజన్ అనేది బాగా కలిసొస్తూ ఉంటుంది.
- By Anshu Published Date - 09:56 PM, Sun - 2 April 23

Tollywood: టాలీవుడ్‌కు సంక్రాంతి పండుగ, సమ్మర్ సీజన్ అనేది బాగా కలిసొస్తూ ఉంటుంది. దీంతో ఈ సమయంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. నిర్మాతలు కూడా ఈ సమయాల్లో సినిమాలను విడుదల చేసేందుకు రెడీ చేసుకుంటారు. సంక్రాంతి అనేది టాలీవుడ్‌కు సెంటిమెంట్‌గా కలిసొస్తుంది. అప్పుడు సినిమాలు రిలీజ్ చేస్తే హిట్ అవుతాయని నమ్ముతారు. అంతేకాకుండా పండుగకు అందరూ సొంతూళ్లకు వెళ్లతారు కనుక ఫ్యామిలీ అందరూ కలిసి సినిమాలు చూస్తారని, కలెక్షన్లు బాగా వస్తాయని భావిస్తారు.
ఇక సమ్మర్ సీజన్‌లో విద్యార్థులకు సెలవులు ఉంటాయి. పరీక్షలు పూర్తై విద్యార్థులు ఇంటికి వెళ్లి రీఫ్రెష్ అవుతూ ఉంటారు. దీంతో ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకు వెళుతూ ఉంటారు. దీంతో ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో భాగంగా ఈ నెలలో ఏకంగా 10 సినిమాలు తెలుగులో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్,. త్రిష, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, శోభిత దూళిపాళ్ల , ప్రభు, శరత్ కుమార్ ప్రాధాన పాత్రలలో మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 2 28వ తేదీన విడుదల కానుంది. ఇక గార్లేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో శ్రీనివాస్ కాకర్ల తెరకెక్కించిన హలో మీరా 21న, బెల్లకొండ గనేష్ నటించిన నేను స్టూడెంట్ సర్ మూవీ 21న, సాయిథరమ్ తేజ్ నటించిన వీరూపాక్ష కూడా 21నే విడుదల కానున్నాయి.
ఇక లారెన్స్ హీరోగా నటించిన రుద్రుడు మూవీ, సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం మూవీ 14వ తేదీన విడుదల కానున్నాయి. ఇక గౌతమ్ కార్తీక్, పూజా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 1947 ఆగస్టు 16 మూవీ, కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ మూవీ 7వ తేదీన విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా సుధీర్ వర్మ తెరకెక్కించిన రావణాసుర సినిమా 7వ తేదీన విడుదల కానుంది.