Game Changer : ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
Game Changer : ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మెగా అభిమానుల్లో జోష్ నింపింది
- By Sudheer Published Date - 10:24 PM, Wed - 8 January 25

తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ టికెట్ ధరల (Ticket Price hike) పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో అని ఈరోజు వరకు కూడా మెగా అభిమానులు టెన్షన్ పడ్డారు. కానీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ (Telangana Govt ) ఇచ్చి మెగా అభిమానుల్లో (Mega Fans) జోష్ నింపింది. ఇటీవల పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట లో ఓ మహిళా మృతి చెందిన ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్..తెలంగాణ లో ఇకపై టికెట్స్ ధరలు పెంచే ఉద్దేశ్యం కానీ బెనిఫిట్ షోస్ కు అనుమతి కానీ జరగదని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. కానీ గేమ్ ఛేంజర్ చిత్రానికి మాత్రం ఉదయం 4 గంటల ఆటకు అనుమతి తో పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చారు.
Younis Khan: ఆఫ్ఘనిస్థాన్ మెంటార్‌గా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్
తొలి రోజు ఉ.4 గంటల షోతో సహా ఆరు ఆటలకు అనుమతిస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 100, మల్టీప్లెక్స్లోలో రూ.150 చొప్పున పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 19 వరకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ లో రూ.100 చొప్పున పెంచుకోవచ్చని పేర్కొంది. మరి ఈ సినిమాతో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్ , వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా సంక్రాంతి బరిలో వస్తున్నాయి. వాటికీ కూడా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం గేమ్ ఛేంజర్ చిత్రానికి టికెట్ ధరలతో పాటు ఉదయం ఆటకు పర్మిషన్ ఇచ్చారు.
RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటేందుకు వస్తున్నాడు. సంచలన దర్శకుడు శంకర్ (Shankar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో బరిలోకి దిగుతుంది. జనవరి 10 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది.