Hanuman : అదరగొడుతున్న హనుమాన్.. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ.. నాలుగు రోజుల్లోనే..
తాజాగా హనుమాన్ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
- By News Desk Published Date - 04:05 PM, Tue - 16 January 24

ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా తెరకెక్కిన హనుమాన్(Hanuman) సినిమా ఈ సంక్రాంతికి జనవరి 12న రిలీజయి భారీ విజయం సాధించింది. ఒక రోజు ముందు నుంచే ప్రీమియర్స్ వేయగా హనుమాన్ మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మన హనుమంతుడుని ఆధారంగా తీసుకొని ఓ సూపర్ హీరో సినిమాగా హనుమాన్ థియేటర్స్ లో ప్రేక్షకులని మెప్పించింది.
గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా కూడా ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో సినిమాకి థియేటర్స్ ఇష్యూ వచ్చినా కంటెంట్ బాగుండటంతో నిలబడింది. మన తెలుగులోనే కాక అమెరికాలో, నార్త్ లో కూడా హనుమాన్ సినిమా దూసుకుపోతుంది. తాజాగా హనుమాన్ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక చిన్న సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే, అది కూడా మరో మూడు పెద్ద సినిమాలు పోటీగా ఉండి కూడా 100 కోట్లు సాధించిందంటే మామూలు విషయం కాదు. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ, చిత్రయూనిట్ కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
హనుమాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. హిందీలో ఇప్పటివరకు 16 కోట్లు వసూలు చేసింది. ఇక అమెరికాలో ఇప్పటికే 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే మన కరెన్సీలో దాదాపు 25 కోట్లు వసూలు చేసింది. ఇక సౌత్ మిగిలిన రాష్ట్రాల్లో దాదాపు 10 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా హనుమాన్ సినిమా ఇప్పటివరకు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దూసుకుపోతుంది.
నాలుగు రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది హనుమాన్. ఇంకా బుకింగ్స్ ఫుల్ అవుతున్నాయి, 18 వరకు హాలిడేస్ కూడా ఉండటం, బాలీవుడ్ లో 26 వరకు ఇంకే సినిమా లేకపోవడంతో హనుమాన్ కి మరింత కలిసొస్తుంది. ఈ ఊపులో హనుమాన్ సినిమా 200 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. హనుమాన్ ఇప్పుడు సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్ లో పలు సౌత్ సినిమాల కలెక్షన్స్ ని దాటేసింది. అమెరికాలో కూడా 3 మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి ఎంటర్ అయి టాప్ 10 తెలుగు సినిమాల్లో నిలిచింది. ఇప్పుడు పండక్కి వచ్చిన నా సామిరంగ, సైంధవ్ కలెక్షన్స్ ని కూడా దాటేసింది హనుమాన్.
ఇక హనుమాన్ 100 కోట్ల కలెక్షన్స్ రావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ ఎమోషనల్ పోస్టులు చేశారు.
My first century in films 😊🙏🏽 pic.twitter.com/VsiqdttRyR
— Prasanth Varma (@PrasanthVarma) January 16, 2024
Also Read : Salaar Success Party : ప్రభాస్ ‘సలార్’ సక్సెస్ పార్టీ వీడియో చూశారా? అఖిల్ బాబు కూడా గెస్ట్ గా..