Tasty Teja Heart Attack : బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ కు హార్ట్ ఎటాక్..ఆ తర్వాత ఏంజరిగిందంటే..!!
- By Sudheer Published Date - 09:48 PM, Tue - 30 January 24
టేస్టీ తేజ…బిగ్ బాస్ షో లో ఎంట్రీ కాకముందు ఇతడంతే పెద్దగా ఎవరికీ తెలియదు..కానీ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత తేజ ఫుల్ ఫేమస్ అయ్యాడు. ప్రతి ఇంట్లో చిన్న పిల్లాడి దగ్గరి నుండి పెద్దవారి వరకు తేజకు అభిమానులయ్యారు. అలాంటి తేజ కు గుండెపోటు వచ్చింది.
బిగ్ బాస్ షో..నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా ఈ రియాల్టీ షో సౌత్ లోను అంతే సక్సెస్ సాధిస్తూ వస్తుంది. ముఖ్యంగా తెలుగులో ఈ షో విపరీతంగా అలరిస్తుంది. ఈ మధ్యనే సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. గత సీజన్ కంటే ఈ సీజన్ ఎంతగానో అలరించడమే కాదు ఈ షో లో పాల్గొన్న వారిని సైతం స్టార్ సెలబ్రెటీస్ ను చేసింది. వారిలో తేజ ఒకరు. బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత అందరు బిజీ అయ్యారు. వరుస సినిమా ఛాన్సులతో బిజీ గా మారిపోయారు. అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ పలు వీడియోస్ తో బాగా ఫేమస్ అవుతున్నారు. శోభా శెట్టి, ప్రియాంక, టేస్టీ తేజ, శుభశ్రీ వంటి వారు సొంతగా ఛానల్ రన్ చేస్తుండగా..ప్రియాంకకు మాత్రం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ ఏమీ లేదు. తన బాయ్‌ఫ్రెండ్ శివ్‌తో కలిసి వీడియోలు చేస్తుంటుంది. తాజాగా ఆమె ప్రియుడు శివ్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో టేస్టీ తేజాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ప్రియాంక హడలిపోయింది. వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలని.. కేకలు పెట్టింది. చివరికి అది.. నిజం కాదని, ప్రాంక్ అని చెప్పడంతో ప్రియాంక ఊపిరి పీల్చుకుంది.
రివెంజ్ కోసం ప్రియాంకపై ప్రాంక్ చేయాలని శివ భావించి… అందుకు తేజను పిలిచాడు. ఈ విషయం చెప్పగానే తేజ.. ముందుగా భయపడ్డాడు. ‘‘మనకు పెద్దగా ధైర్యం లేదు ఆమెతో డీల్ చేయడానికి. మామూలుగా ఉండదు. చూశావుగా బిగ్ బాస్ హౌజ్‌లో’’ అని చెప్తూనే ట్రై చేద్దామని చెప్పుకొచ్చారు.వంట చేస్తూ హార్ట్ ఎటాక్ వచ్చినట్టు యాక్ట్ చేయమని తేజతో చెప్పాడు శివ్. అది వినగానే తేజ.. షాక్ అయ్యాడు..ఫైనల్‌గా ప్రాంక్ చేయడానికి ఒప్పుకున్నాడు. కిచెన్‌లోకి వెళ్లిన తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని చెప్పడం మొదలుపెట్టిన తేజ.. గుండెలో నొప్పి వస్తుందంటూ కుప్పకూలిపోయాడు . అది చూసిన ప్రియాంక.. కంగారుతో శివ్‌ను పిలిచి ఆంబులెన్స్‌కు కాల్ చేయమని చెప్పింది. అప్పటికే శివ్.. అందరి ఫోన్స్‌ను దాచిపెట్టాడు. దీంతో ఏం చేయాలో తెలియక అటు, ఇటు పరుగులు తీసింది ప్రియాంక. ‘‘బుద్ధి లేదు, యెదవ’’ అంటూ కంగారులో శివ్‌ను తిట్టడం మొదలుపెట్టింది. అంతలోనే ఫోన్ దొరికిందని ప్రియాంకకు ఇచ్చాడు శివ్. అంబులెన్స్‌ను కాల్ చేయమని శివ్‌ను పక్కకు పంపించగానే తేజ లేచి.. జరిగిందంతా ప్రియాంకతో చెప్పేశాడు. దీంతో శివ్‌ను చితకబాదింది ప్రియాంక. అలా వీరి ప్రాంక్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Read Also : Somesh Kumar : మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఆస్తుల జాబితాలో సరికొత్త విషయాలు బట్టబయలు
Related News
Heart Attack: ట్రాఫిక్ సౌండ్ కూడా గుండెపోటుకు దారి తీస్తుందా..?
ట్రాఫిక్ శబ్దం, గుండె సంబంధిత వ్యాధుల అభివృద్ధికి మధ్య సంబంధం ఉన్నట్లు రుజువులను కనుగొన్న తర్వాత ఈ రకమైన శబ్ద కాలుష్యం గుండె జబ్బులకు ప్రమాద కారకంగా గుర్తించబడాలని పరిశోధకులు అంటున్నారు.