Veteran US actor Ron Ely : ‘టార్జాన్’ నటుడు కన్నుమూత
Veteran US actor Ron Ely : ఆయన మరణవార్తను కుమార్తె కిన్స్టెన్ (Kirsten Casale Ely) సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఆమె తన ట్వీట్లో ఈ ప్రపంచం తనకు తెలిసిన గొప్ప వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది
- By Sudheer Published Date - 01:39 PM, Thu - 24 October 24

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది, హాలీవుడ్ ప్రముఖ నటుడు రాన్ ఎలీ (Ron Ely 86 ) కన్నుమూశారు. 1960లలో ‘టార్జాన్’ (Tarzan ) పాత్రలో ఆయన తన కండలు తిరిగిన శరీరంతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాతో రాన్ ఎలీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది, ఇది ఆయన కెరీర్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన పాత్రగా నిలిచింది. ఆయన మరణవార్తను కుమార్తె కిన్స్టెన్ (Kirsten Casale Ely) సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఆమె తన ట్వీట్లో ఈ ప్రపంచం తనకు తెలిసిన గొప్ప వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది.
అలాగే నేను నా తండ్రిని కోల్పోయాను. మా నాన్నని అందరు హీరో అని పిలిచేవారు. ఆయన నటుడిగా, రచయితగా, కోచ్‌గా, గురువుగా, కుటుంబ వ్యక్తిగా, నాయకుడిగా రాణించిన వ్యక్తి. అతడు ఏ రంగంలోకి వెళ్లిన అక్కడ తన మార్క్‌ను చూపించడమే కాకుండా.. పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసేవారు. అతను ఇతరులపై చూపిన ప్రభావం నేను మరే వ్యక్తిలోనూ చూడనిది. అతనిలో నిజంగా ఏదో అద్భుతం ఉంది. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు అంటూ కిర్‌స్టెన్ ఎలీ రాసుకోచ్చింది.100కి పైగా సినిమాలు, టీవీ షోలలో నటించిన రాన్, 2001లో నటనకు వీడ్కోలు పలికి, రచయితగా తన కెరీర్‌ను కొనసాగించారు. రాన్ ఎలీ మరణ వార్త తెలిసి ప్రతి ఒక్కరు ఆయనకు సంతాపం తెలియజేస్తూ ..ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.
Read Also : Cycle Symbol : ‘ఇండియా’ అభ్యర్థులంతా ‘సైకిల్’ గుర్తుపైనే పోటీ చేస్తారు : అఖిలేష్