Harassment : బూతులు తిడుతూ నరకం చూపిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న బాలయ్య హీరోయిన్
Harassment : “నేను ఐదేళ్లుగా నరకాన్ని అనుభవిస్తున్నాను. ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. నా ఆరోగ్యం దెబ్బతింది. మానసికంగా విపరీతంగా క్షీణించాను. ఇంట్లో పనిమనిషిని పెట్టుకోలేను, ఎందుకంటే ఇంతవరకూ వచ్చినవారు దొంగతనాలు చేశారు.
- By Sudheer Published Date - 11:49 AM, Wed - 23 July 25

‘ఆషిక్ బనాయా ఆప్నే’తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తనుశ్రీ దత్తా (Tanushree Dutta), అందంతో పాటు అభినయంతో కూడా మంచి గుర్తింపు పొందింది. తెలుగులో బాలకృష్ణ సరసన ‘వీరభద్ర’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. 2018లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన #MeToo ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఆమె తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి ఆమె వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచింది.
సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక ఎమోషనల్ వీడియోలో తనుశ్రీ దత్తా కన్నీటి పర్యంతమై, “నేను ఐదేళ్లుగా నరకాన్ని అనుభవిస్తున్నాను. ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. నా ఆరోగ్యం దెబ్బతింది. మానసికంగా విపరీతంగా క్షీణించాను. ఇంట్లో పనిమనిషిని పెట్టుకోలేను, ఎందుకంటే ఇంతవరకూ వచ్చినవారు దొంగతనాలు చేశారు. అందుకే అన్ని పనుల్ని నేనే చేసుకోవాల్సి వస్తోంది” అంటూ వేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు.
Shocking : ఢిల్లీ పోలీసుల సంచలనం.. రూ. 2 కోట్లతో పరారైన ఎస్సై జంట అరెస్ట్
తనుశ్రీ తన ఇంటి బయట నిత్యం అనుమానాస్పద వ్యక్తులు నిఘా పెడుతున్నారని ఆరోపించింది. ఈ పరిస్థితులన్నింటినీ భరించలేక పోతున్నానని, ఒకరైనా సహాయం చేయాలని ఆవేదనతో కోరింది. తన వీడియో చూసిన కొందరు పోలీసులకు ఫోన్ చేయగా, స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని వారిచెప్పినట్లు తనుశ్రీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
గతంలోనూ తనుశ్రీ దత్తా నానా పటేకర్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, ఇతరులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టించింది. అప్పట్లో ఆమె ధైర్యానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె కుటుంబంలోనే వేధింపులకు గురవుతుండటం అందరినీ కలచివేసింది. ఒకప్పుడు న్యాయపోరాటానికి నడిచిన ఆమె, ఇప్పుడు తన జీవితానికి న్యాయం కావాలంటూ కన్నీటి విందు చేయడం హృదయవిదారకంగా ఉంది.