Tana Maha Sabalu: అంగరంగ వైభవంగా తానా సభలు, బాలయ్యతో పాటు ప్రముఖుల సందడి
ఫిలడెల్ఫియా లో జూలై 7, 8, 9 తేదీల్లో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న తానా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
- By Balu J Published Date - 12:22 PM, Sat - 8 July 23

USA లోని ఫిలడెల్ఫియా లో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జూలై 7, 8, 9 తేదీల్లో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న తానా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ లతో కలిసి తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, అక్కడికి వచ్చిన NRI లతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…. ఎవరు ఎక్కడ ఉన్నా, nri లు సహా, తెలుగు ప్రజలు ఒక్కటేనని, ఈ సభలకు ప్రతి సంవత్సరం హాజరవుతానన్నారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. Nri లు అందరికీ మహా సభల శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లిలు హైదరాబాద్ కు వచ్చి బాలకృష్ణను స్వయంగా కలిసి తానా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందించిన సంగతి తెలిసిందే. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను, తెలుసుకుని తానా నాయకులను బాలకృష్ణ అభినందించారు. డిసెంబర్ 2022లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కోటి రూపాయల విరాళాన్ని అందించిన విషయాన్ని బాలయ్య గుర్తు చేసుకున్నారు.
Also Read: Rahul Gandhi: ట్రాక్టర్ నడిపి.. వరినాట్లు వేసి, రైతులతో రాహుల్ ముచ్చట్లు