Vijay : విజయ్ చివరి సినిమా టైటిల్ అనౌన్స్.. తన పొలిటికల్ కెరీర్ కి కరెక్ట్ గా సరిపోయేలా..
నేడు రిపబ్లిక్ డే సందర్భంగా విజయ్ 69వ సినిమా, తన కెరీర్ చివరి సినిమా టైటిల్ ని ప్రకటించారు.
- By News Desk Published Date - 11:30 AM, Sun - 26 January 25

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలు ఆపేస్తానని ప్రకటించాడు. దీంతో విజయ్ చివరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్లో H వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
తాజాగా నేడు రిపబ్లిక్ డే సందర్భంగా విజయ్ 69వ సినిమా, తన కెరీర్ చివరి సినిమా టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాకు ‘జన నాయగన్’ అనే టైటిల్ ప్రకటించారు. ప్రస్తుతం తమిళ్ టైటిల్ ఒకటే ప్రకటించారు. రిలీజ్ సమయంలో తెలుగులో జన నాయకుడు అని ప్రకటిస్తారేమో చూడాలి. టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ కార్యకర్తలతో సెల్ఫీ తీసుకుంటున్నట్టు ఉంది.

Jana Nayagan
దీంతో ఈ టైటిల్, పోస్టర్ తన పొలిటికల్ కెరీర్ కి కలిసొచ్చేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సినిమా బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. మరి విజయ్ లాస్ట్ సినిమా ఎలా ఉంటుందో, ఏ రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.
#JanaNayagan pic.twitter.com/cs51UDEi1Q
— Vijay (@actorvijay) January 26, 2025
Also Read : Hanu Raghavapudi : నాని రిజెక్ట్ చేసిన కథతో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన హను రాఘవపూడి..