Hanu Raghavapudi : నాని రిజెక్ట్ చేసిన కథతో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన హను రాఘవపూడి..
తాజాగా మొదటిసారి హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమా గురించి మాట్లాడాడు.
- By News Desk Published Date - 11:18 AM, Sun - 26 January 25

Hanu Raghavapudi : ప్రభాస్ ప్రస్తుతం వరస భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కల్కి సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్, ఇమాన్వి జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ డైరెక్టర్ ఎక్కడా స్పందించలేదు. తాజాగా మొదటిసారి హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమా గురించి మాట్లాడాడు. అలాగే గతంలో హను నానికి ఓ ఆర్మీ కథ చెప్పారని, అది వర్కౌట్ అవ్వలేదని ఆ కథే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై కూడా హను క్లారిటీ ఇచ్చారు.
హను రాఘవపూడి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు చూడని ఓ కొత్త కథని చూపించబోతున్నాం. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృస్టిస్తున్నాం. ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఆయనకు తగ్గట్టే సినిమా భారీగా ఉంటుంది. నానికి చెప్పిన కథ ప్రభాస్ చేసే సినిమా ఒకటి కాదు. నానికి ఆర్మీ కథ చెప్పింది నిజమే. నా దగ్గర ఆరు ఆర్మీ బ్యాక్ డ్రాప్ కథలు ఉన్నాయి. అందులో సీతారామం ఒకటి చేశాను. ఇప్పుడు ఒకటి ప్రభాస్ తో చేస్తున్నాను. ఈ కథ ప్రభాస్ కోసమే రాసాను. ఈ కథ రాయడానికి నాకు దాదాపు ఏడాది పట్టింది. ఆడియన్స్ కచ్చితంగా ఈ సినిమా చూసాకా సర్ ప్రైజ్ ఫీల్ అవుతారు అని తెలిపాడు. దీంతో హను కామెంట్స్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Mass Jathara : రవితేజ మాస్ జాతర గ్లింప్స్ వచ్చేసింది.. మనదే ఇదంతా..