Vijay Kanth: నడవలేని స్థితిలో తమిళ స్టార్ విజయ్ కాంత్..
ప్రముఖ తమిళ సినీ నటుడు (Tamil Star) విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
- Author : Maheswara Rao Nadella
Date : 02-02-2023 - 2:20 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ తమిళ సినీ నటుడు విజయకాంత్ (Vijay Kanth) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 70 ఏళ్ల విజయకాంత్ తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సైతం అడుగుపెట్టి… డీఎండీకే పార్టీని స్థాపించారు. తాజాగా విజయకాంత్ దంపతులను తమిళ సూపర్ స్టార్ విజయ్ తండ్రి, కోలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కలిసి పరామర్శించారు.
విజయకాంత్ (Vijay Kanth) డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఈ కారణంతో మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్టు చెపుతున్నారు. విజయకాంత్ ను కలిసిన ఫొటోలను చంద్రశేఖర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో పలు చిత్రాలు వచ్చాయి. 1971లో విజయకాంత్ కథానాయకుడిగా ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.
Also Read: Rama Statue in Ayodhya: అయోధ్యలో రాముని విగ్రహం కోసం నేపాల్ నుండి శిలలు