Tamil Producer Dilli Babu Dies : నిర్మాత డిల్లీ బాబు మృతి
Tamil Producer Dilli Babu Dies : కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- By Sudheer Published Date - 11:15 AM, Mon - 9 September 24

Tamil Producer Dilli Babu Dies : చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. పలు కారణాలతో సినీ ప్రముఖులు మరణిస్తూ వస్తున్నారు. కొంతమంది అనుకోని ప్రమాదాలతో మృతి చెందుతుండగా.. మరికొంతమంది అనారోగ్యంతో కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ తమిళ సినీ నిర్మాత డిల్లీ బాబు (Dilli Babu)(50) కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యతో రాక్షసన్
మరికాసేపట్లో డిల్లీ బాబు భౌతికకాయాన్ని నివాళులర్పించేందుకు చెన్నైలోని పెరుంగళత్తూరు స్వగృహానికి తీసుకురానున్నారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో బాబు ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో సూర్యతో రాక్షసన్, ఓ మై గాడ్, బ్యాచిలర్ వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ బ్యానర్ పై ఈయన తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా మిరల్, మరకతమణి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి.
తమిళ్ అసెంబ్లీకి ఎన్నిక
ఢిల్లీ బాబు 1965 ఫిబ్రవరి 12న జన్మించారు. ఈయన వయసు 59 సంవత్సరాలు. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ తరుపున తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాల్లో కూడా సత్తా చాటారు. ఈయన మృతిపై సీపీఎం అనుబంధ సంఘాలు కూడా తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Read Also : AP Rains Highlights: ఏపీలో పెరుగుతున్న మృతుల సంఖ్య