Natural Star Nani: నాని కోసం క్యూ కడుతున్న తమిళ తంబీలు
నేచురల్ స్టార్ నానిపై కోలీవుడ్ దర్శకులు కన్నేశారు. ఈ ఏడాది దసరా లాంటి మాస్ కమర్షియల్ సినిమా, హాయ్ నాన్నా లాంటి ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా రెండూ సక్సెస్ కావడంతో తమ కథలతో ఒప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 14-12-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
Natural Star Nani: నేచురల్ స్టార్ నానిపై కోలీవుడ్ దర్శకులు కన్నేశారు. ఈ ఏడాది దసరా లాంటి మాస్ కమర్షియల్ సినిమా, హాయ్ నాన్నా లాంటి ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా రెండూ సక్సెస్ కావడంతో తమ కథలతో ఒప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ముందుగా సిబి చక్రవర్తి నానిని కలిశారు. నానికో కథ చెప్పడంతో దాదాపుగా ఒకే అయినట్లు తెలుస్తుంది. కానీ బడ్జెట్ 100 కోట్లు అని చెప్పడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. దీంతో ఆఫీస్ ప్రారంభించిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఇప్పుడు ఆ జాబితాలో కార్తీక్ సుబ్బరాజ్ కూడా చేరాడు. కానీ అతని కథనం చాలా భిన్నంగా ఉంది. కథ తెలుగు ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం అంత సులభం కాదు. జిగర్ తండా డబుల్ ఎక్స్ తమిళంలో సూపర్ హిట్ అయినా ఇక్కడ డిజాస్టర్ అయింది. పేట కూడా అంతే. పైగా ఆయన ఎవరి మాటా వినే రకం కాదు. తను రాసిన దాన్ని మార్చడానికి ఒప్పుకోడు. ఈ విషయాన్ని స్వయంగా ఎస్‌జే సూర్య, లారెన్స్ చెప్పారు. కాబట్టి ఈ కలయికను సెట్ చేయడం అనుకున్నంత సులభం కాదు.ఇవన్నీ ప్రతిపాదనల దశలో ఉన్నాయి.
ప్రస్తుతం శనివారం సినిమాపై నాని సీరియస్ గా దృష్టి సారించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు.
Also Read: Coconut: కష్టాలు సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే కొబ్బరికాయతో ఈ పరిహారం ట్రై చేయాల్సిందే?