Tamannaah and Vijay Varma: బాలీవుడ్ నటుడితో మిల్కీ బ్యూటీ డేటింగ్.. కిస్సింగ్ వీడియో వైరల్
బాలీవుడ్ నటుడితో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) రొమాన్స్ చేస్తోంది. ఓ కిస్సింగ్ వీడియో వైరల్ అవుతోంది.
- By Balu J Published Date - 04:42 PM, Mon - 2 January 23

మిల్కీ బ్యూటీ (Tamannaah) బాలీవుడ్ నటుడితో రొమాన్స్ చేస్తుందా? అంటే అవుననే అంటోంది మీడియా. తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు గల్లీ బాయ్, డార్లింగ్స్ ఫేమ్ విజయ్ వర్మ (Vijay Varma) డేటింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేళ ఈ జంట ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. తమన్నా భాటియా, విజయ్ వర్మల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2023కి స్వాగతం పలుకుతూ గోవాలో ముద్దులు పెట్టుకున్నారు. విజయ్ తన తెల్లటి చొక్కాలో అందంగా కనిపించగా, తమన్నా హాట్ పింక్ కలర్ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
తమన్నా(Tamannaah), విజయ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అభిమానులు అంటున్నారు. అయితే ఈ రూమర్స్ పై రియాక్ట్ కాలేదు. తమన్నా భాటియా, విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్ 2 సెట్స్‌లో కలుసుకున్నారు. షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్. తమన్నా, విజయ్ చాలాసార్లు కలిసి కనిపించారు కానీ వారు డేటింగ్ (Dating) చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇటీవల, దిల్జిత్ దోసాంజ్ కచేరీలో ఇద్దరూ కలిసి కనిపించారు. డిసెంబర్ 21 న నటి పుట్టినరోజున విజయ్ కూడా తమన్నా (Tamannaah) ఇంట్లో కనిపించాడు. న్యూయర్ సెలబ్రేషన్స్ లో ముద్దులు పెట్టుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
Friday seems super lit for these celebs as #TamannahBhatia, #VijayVerma, and #KartikAaryan attend #DiljitDosanjh's concert. 🎤 pic.twitter.com/CMMfqgm8Hs
— Pinkvilla (@pinkvilla) December 9, 2022