Tamanna Bhatia : తమన్నా కు కోపం వస్తే వెంటనే చేసే పని అదేనట..!!
- Author : Sudheer
Date : 06-03-2024 - 3:36 IST
Published By : Hashtagu Telugu Desk
ఎప్పుడు కూల్ గా కనిపించే మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna Bhatia)..కోపం (Angry ) వస్తే మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే రూమ్ కు వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుందట. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీ లో రాణిస్తున్న తమన్నా.. 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే హిందీ మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. అదే ఏడాది ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.
తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ మిల్కీ భామ పర్సనల్ లైఫ్‌ను బాగానే బ్యాలెన్స్ చేస్తోంది. బాలీవుడ్లో సెటిల్ అయిన తెలుగోడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేస్తోంది. కానీ పెళ్లి గురించి మాత్రం బయటకు ఓపెన్ కావడం లేదు. పబ్లిక్ ప్లేస్ లలో ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. షూటింగ్స్‌లో కాస్త గ్యాప్ దొరికినా వెకేషన్స్, పార్టీలంటూ ఫుల్‌గా చిల్ కొడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తమన్నాకు సంబదించిన ఓ వార్త బయటకు వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
తమన్నా కోపంగా కనిపించిన దాఖలు చాల తక్కువ..షూటింగ్ లలో కూడా నవ్వుతు..అందర్నీ నవ్విస్తూ కలివిడిగా ఉంటుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తమన్నాకు కోపం బానే ఎక్కువట. అందుకే కోపం రాగానే వెంటనే ఓ గదిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుంటుందట. కాసేపు ఎవ్వరితోనూ అస్సలు మాట్లాడదట. అనంతరం కూల్ వాటర్‌తో షవర్ చేసి ప్రశాంతంగా తన కోపానికి చల్లార్చుకుంటుందట. ఎవరి వల్ల కోపం వచ్చిందో వారితోనే డిస్కస్ చేసి సమస్యను క్లియర్ చేసుకుంటుందట. అందుకే ఆమె అందరితో ఆలా ఉంటుందని ఆమె దగ్గరి వారు తాజాగా బయటపెట్టారు.
ప్రస్తుతం తమన్నా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్స్ కూడా చేస్తోంది. ప్రస్తుతం తమన్నా నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. ‘అరణ్మనై 4’, ‘స్త్రీ 2’, ‘వేద’, ‘ఓదెల 2’ వంటి సినిమాలు ఉన్నాయి.
Read Also : TS : KTR ‘జాతక రామారావు’ అయ్యాడంటూ కాంగ్రెస్ సైటైర్