Surya Kiran : సత్యం ఫేమ్ డైరెక్టర్ సూర్య కిరణ్ మృతి..
- Author : Sudheer
Date : 11-03-2024 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటుచేసుకుంది. సత్యం (Satyam) ఫేమ్ డైరెక్టర్ సూర్య కిరణ్ (Director Surya Kiran) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. హీరో సుమంత్ (Sumanth) హీరోగా నటించిన ‘సత్యం’ మూవీ తో సూర్య చిత్రసీమ కు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ధన 51, రాజూభాయ్, చాప్టర్ 6, నీలిమై తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ప్రేక్షకులను మెప్పించారు. అలాగే కొన్ని చిత్రాలకు రచయితగా కూడా పనిచేశారు. సూర్యకిరణ్ నటి కళ్యాణి (Kalyani)ని పెళ్లాడారు. కానీ, కొన్నాళ్లకు ఈ దంపతులు విడిపోయారు. కల్యాణీ తనకు దూరమైనప్పటికీ… ఆమె అంటే తనకు ఇష్టమని, ఆమెను తాను ప్రేమిస్తున్నానని సూర్య కిరణ్ ఒకట్రెండు సందర్భాల్లో చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
గత కొంతకాలంగా సినిమా చాన్సులు రాకపోవడం , ఇటు వైవాహిక జీవితంలోను అంటకాలు ఎదురుకావడం తో కాస్త అనారోగ్యానికి గురయ్యారు. ఇదే క్రమంలో రెండు నెలల క్రితం పచ్చ కామెర్లు రావడంతో ఆయన శివైక్యం చెందారని కుటుంబ వర్గాలు చెబుతున్నారు. రెండు నెలలుగా కామెర్లతో, అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారట. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం తుది శ్వాస విడిచారు. రేపు (మంగళవారం) అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిన్న వయసులో సూర్య కిరణ్ మరణించడంతో చిత్రసీమలో పలువురు షాక్ అయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
Read Also : YCP Manifesto 2024 : రేపే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. హామీలు సూపర్ గా ఉండబోతాయట