Suriya : లారెన్స్ సినిమాలో ‘రోలెక్స్’ క్యామియో.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్..
లారెన్స్ 'బెంజ్' సినిమాలో 'రోలెక్స్' క్యామియో ఉండబోతుందట. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ భాగంగా..
- By News Desk Published Date - 08:40 PM, Thu - 30 May 24

Suriya : విక్రమ్, ఖైదీ, లియో సినిమాలతో ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్.. LCUలో రాబోయే సినిమాలు గురించి ఒక షార్ట్ ఫిలింని త్వరలో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. కాగా ప్రస్తుతం ఈ దర్శకుడు రజినీకాంత్ తో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ LCUలో భాగంగా రావడం లేదని సమాచారం. ఇది ఇలా ఉంటే, రీసెంట్ గా ఈ దర్శకుడు తన నిర్మాణంలో రాఘవ లారెన్స్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేసారు.
ఆ సినిమా ‘బెంజ్’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాకి లోకేష్ కథని అందిస్తుండగా, బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతోందని సమాచారం. ఈక్రమంలోనే రోలెక్స్ పాత్రని ఈ సినిమాలో చూపించబోతున్నారట. విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర ఏ రేంజ్ లో పండిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు.
లోకేష్ టేకింగ్, రోలెక్స్ గా సూర్య స్క్రీన్ ప్రెజెన్స్.. ఆడియన్స్ ని బాగా థ్రిల్ చేసింది. ఇప్పుడు ఆ పాత్రని లారెన్స్ సినిమాలో చూపిస్తే.. మూవీకి హెల్ప్ అవుతుందని మేకర్స్ భావించారట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. నిజానికి రోలెక్స్ పాత్రని రాఘవ లారెన్స్ చేయాల్సింది. రోలెక్స్ పాత్ర కోసం లోకేష్ ముందుగా రాఘవ లారెన్స్ ని సంప్రదించారు. కానీ అప్పుడు లారెన్స్ చేయలేకపోయారు.
మరి రోలెక్స్ పాత్రని మిస్ చేసుకున్న లారెన్స్.. ఇప్పుడు బెంజ్ పాత్రతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. ఈ సినిమాని పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారట. ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని వివరాలను, నటీనటుల డీటెయిల్స్ ని త్వరలోనే తెలియజేయనున్నారు.