Retro: సూర్య రెట్రో మూవీ మెలోడీ సాంగ్ రిలీజ్.. వీడియో వైరల్?
సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా రెట్రో నుంచి తాజాగా మెలోడీ సాంగ్ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- By Anshu Published Date - 10:00 AM, Tue - 4 March 25

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రెట్రో. గత ఏడాది కంగువ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హీరో సూర్య ఇప్పుడు రెట్రో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. కంగువ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇకపోతే రెట్రో సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని మూవీ మేకర్స్ తో పాటు అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఇది ఇలా ఉండే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ మి విడుదల చేశారు మూవీ మేకర్స్. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను కపిలన్ ఆలపించారు. రెట్రో నుంచి రిలీజ్ అయిన ఈ మెలోడీ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. సూర్య జైలులో ఉన్న సీన్లతో ఈ పాట ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. పూజా హెగ్డేతో సూర్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.
మే 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. కాగా సూర్యతో చేసిన రెట్రో టీజర్ తో పాటు ఈ సాంగ్ ను చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా కంగువ మూవీ కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. అయితే కంగువ సినిమా సూర్య అభిమానులను అలాగే సూర్యని భారీగా నిరాశపరిచింది. మరి రెట్రో సినిమా అయినా అభిమానులను మెప్పిస్తుందేమో చూడాలి మరి. తాజాగా విడుదలైన సాంగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మెలోడీ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.