Suriya : కార్తితో సినిమా తీసిన డైరెక్టర్ కి.. ఫేవరేట్ కార్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..
తాజాగా సత్యం సుందరం డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
- By News Desk Published Date - 11:36 AM, Sun - 11 May 25

Suriya : హీరోలు, నిర్మాతలు అప్పుడప్పుడు లేదా సినిమాలు హిట్ అయినప్పుడు దర్శకులకు కార్స్, ఖరీదైన వాచ్ లు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. తాజాగా సూర్య తన తమ్ముడు కార్తీతో సినిమా తీసిన డైరెక్టర్ కి అతని ఫేవరేట్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారట. కార్తీ, అరవింద్ స్వామిలతో ఇటీవల సత్యం సుందరం అనే సినిమాని తెరకెక్కించారు ప్రేమ్ కుమార్. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ అనిపించినా అందరికి నచ్చి ఒక క్లాసిక్ సినిమాలా నిలిచింది.
తాజాగా సత్యం సుందరం డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రేమ్ కుమార్ ఎప్పట్నుంచో మహీంద్రా వైట్ థార్ ని కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఆ మోడల్ దొరకట్లేదు. చాలా రోజులు ఆ కలర్ కార్ కోసం చూసి దొరకకపోవడంతో దానిపై ఆశలు వదులుకున్నాడు. అయితే సూర్య ఫ్యామిలీకి సన్నిహితుడైన రాజా అనే వ్యక్తికి ప్రేమ్ కుమార్ ఈ విషయం చెప్పి ఎక్కడైనా వైట్ థార్ కొత్త కార్ అందుబాటులో ఉంటే చెప్పండి కొనుక్కుంటాను అని చెప్పాడట. ఇందుకు ప్రేమ్ కుమార్ డబ్బులు కూడా దాచుకున్నాడట.
ఒకానొక సమయంలో డబ్బులు అవసరం అయి కార్ కోసం దాచుకున్న డబ్బులు వాడేసాడు. కొన్ని రోజుల క్రితం సడెన్ గా సూర్య వైట్ థార్ కార్ ఫోటో పంపించి వచ్చేసింది అని మెసేజ్ పెట్టారట. వెంటనే ప్రేమ్ కుమార్ రాజాకు ఫోన్ చేసి సూర్య సర్ ఇలా కార్ వచ్చిందని మెసేజ్ చేసారు, కానీ నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు అని చెప్తే డబ్బులు అవసర్లేదు అది గిఫ్ట్ గా ఇస్తున్నారు అని చెప్పడంతో ఆశ్చర్యపోయాడట.
కార్తీ స్వయంగా ఆ కార్ ని ప్రేమ్ కుమార్ కి అందించారు. కార్తీతో, రాజాతో, ఆ వైట్ థార్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రేమ్ కుమార్ ఈ విషయం పంచుకున్నాడు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు సూర్యని అభినందిస్తున్నారు.
Also Read : VishwakSen : మరోసారి దర్శకుడిగా మారిన విశ్వక్ సేన్.. నిర్మాతగా కూడా.. కొత్త సినిమా అనౌన్స్..