Sumanth : పాత ఫొటోని పట్టుకొని ఎంత పని చేశారు.. మృణాల్ తో ఫొటో.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్..
సుమంత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు.
- By News Desk Published Date - 02:00 PM, Sun - 11 May 25

Sumanth : ఒకప్పుడు వరుసగా ఆనిమాలు చేసిన సుమంత్ ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో అనగనగా అనే ఓటీటీ సినిమాతో రాబోతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా సుమంత్ వార్తల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. సుమంత్, మృణాల్ ఠాకూర్ కలిసి క్లోజ్ గా దిగిన ఒక ఫొటోని షేర్ చేసి పలువురు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రమోట్ చేశారు. నేషనల్ మీడియా కూడా ఈ వార్త రాయడంతో నిజమేనేమో అనుకున్నారు.
అయితే అనగనగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. మృణాల్, సుమంత్ వైరల్ అయిన ఫొటోని చూపించి మీ మీద రూమర్స్ వస్తున్నాయి, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారంట నిజమేనా అని అడిగారు.
దీనికి సుమంత్ సమాధానమిస్తూ.. నేను సోషల్ మీడియా ఎక్కువగా వాడను కాబట్టి అసలు ఈ విషయం నాకు తెలియదు. ఆ ఫొటో సీతారామం సినిమా ప్రమోషన్స్ టైంలోది. ఆ తర్వాత మేము మళ్ళీ కలవలేదు. ఆ వార్తలు అన్ని అబద్దాలే అని తెలిపాడు. మరో ఇంటర్వ్యూలో.. నాకు మళ్ళీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టే ఆలోచన లేదు. ప్రస్తుతం ఇలా హ్యాపీగానే ఉన్నాను అని అన్నాడు.
దీంతో మృణాల్, సుమంత్ కలిసి దిగింది అది పాత ఫొటో అని, పెళ్లి టాపిక్ వట్టి రూమర్స్ అని క్లారిటీ ఇచ్చేసాడు. పాత ఫొటో షేర్ చేసి ఎంత పెద్ద రూమర్ వైరల్ చేసారో అని ఆశ్చర్యపోతున్నారు. సుమంత్ గతంలో హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకోగా ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు.
Also Read : Raj Tarun : వివాదాలు వచ్చినా వరుస సినిమాలు.. తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రాజ్ తరుణ్..