Sukumar Vijay Devarakonda : సుకుమార్ తో విజయ్ దేవరకొండ.. ఇంకా ఛాన్స్ ఉందంటున్నారు..!
Sukumar Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటూ 2022 లో ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది.
- By Ramesh Published Date - 06:25 AM, Tue - 21 May 24

Sukumar Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటూ 2022 లో ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాతగా ఈ ప్రకటన వచ్చింది. అయితే అప్పటికే పుష్ప 1 తీస్తున్న సుకుమార్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పార్ట్ 2 ప్లాన్ చేశాడు. పుష్ప 2 తర్వాత సుకుమార్ ఆల్రెడీ రాం చరణ్ తో సినిమా లాక్ చేసుకున్నాడు. సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా ప్రకటన ఇచ్చి రెండేళ్లు అవుతున్నా ఆ తర్వాత మళ్లీ ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.
లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాతో కేదార్ సెగలంశెట్టి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ డీటైల్స్ చెప్పారు. సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా ఎప్పటికైనా ఉంటుంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 చేస్తున్నారు ఆ తర్వాత సినిమా కూడా లాక్ చేశారు.
Also Read : Mega Fans Unsubscribing Aha : ఆహా అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..?
ఆ సినిమా తర్వాత విజయ్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు నిర్మాత కేదార్ సెలగంశెట్టి. పుష్ప తర్వాత సుకుమార్ రేంజ్ ఏంటన్నది తెలిసిందే. పుష్ప తర్వాత ఆయన తప్పకుండా తన హీరోల విషయంలో ఆచి తూచి అడుగులేస్తాడు. విజయ్ తో చేయాల్సిన సబ్జెక్ట్ వస్తే తప్ప ఏదో చేయాలని చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం 3 క్రేజీ ప్రాజెక్ట్ లతో వస్తున్నాడు. ఈ 3 సినిమాలు పూర్తయ్యే లోగా సుకుమార్ చరణ్ సినిమా పూర్తైతే అప్పుడు ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.