Suchi Leaks : సుచీ లీక్స్ ఎగైన్.. ధనుష్ 3 గంటల దాకా అదే పనిచేస్తాడా..?
Suchi Leaks కోలీవుడ్ లో సుచీ లీక్స్ ఎంత సెన్సేషన్ సృష్టించాయో తెలిసిందే. సింగర్ సుచిత్ర సుచీ లీక్స్ అంటూ తన సోషల్ మీడియాలో తమిళ సినీ ప్రముఖుల సీక్రెట్
- By Ramesh Published Date - 05:18 PM, Tue - 14 May 24

Suchi Leaks కోలీవుడ్ లో సుచీ లీక్స్ ఎంత సెన్సేషన్ సృష్టించాయో తెలిసిందే. సింగర్ సుచిత్ర సుచీ లీక్స్ అంటూ తన సోషల్ మీడియాలో తమిళ సినీ ప్రముఖుల సీక్రెట్ మ్యాటర్స్ లీక్ చేసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ లీక్స్ మధ్యలో కొన్నాళ్లు ఆగిపోయాయి. ఆ తర్వాత సుచిత్ర అనారోగ్యం తో ఉందని చెప్పుకొచ్చారు. అయితే లేటెస్ట్ గా సుచిత్ర మళ్లీ లీక్స్ మొదలు పెట్టింది. ఆమెకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈసారి కూడా ధనుష్ గురించి లీక్స్ వదిలింది సుచిత్ర. ధనుష్ కు పార్టీలంటే ఇష్టమని.. రోజు రాత్రి 3 గంటల దాకా పార్టీ చేసుకుంటాడని. అంతేకాదు ధనుష్ ఐశ్వర్య ఒకరికొనరు మోసం చేసుకున్నారని. అతనికి చాలా ఎఫైర్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది సుచిత్ర. అంతేకాదు ఐశ్వర్య గురించి కూడా ఆమె అలాంటి కామెంట్స్ చేసింది.
Also Read : Ram Charan : బెస్ట్ హస్బండ్ మాత్రమే కాదు బెస్ట్ థెరపిస్ట్ కూడా..!
ఇదివరకు త్రిష, రానా, అనిరుద్, ఆండ్రియా ఇలా కొంతమందికి సంబందించిన ఫోటోలను లీక్ చేసిన సుచిత్ర ఈసారి కూడా మళ్లీ ధనుష్ తో లీక్స్ మొదలు పెట్టింది. ఇదే ఇంటర్వ్యూలో తన భర్త స్వలింగ సంపర్కుడని కూడా కామెంట్ చేసింది సుచిత్ర. ప్రస్తుతం ఇది కోలీవుడ్ మీడియా లో హడావిడి చేస్తుంది. అయితే ధనుష్ ఫ్యాన్స్ మాత్రం సుచిత్ర కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు.
— Mr.nani (@IndWC23) May 13, 2024