HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Strike Back If You Dare Pawan Calls Out

Pawan Kalyan : దమ్ముంటే తిరిగి కొట్టండి..అంటూ పవన్ పిలుపు

Pawan Kalyan : సోషల్ మీడియా ట్రోల్స్‌కు భయపడే వ్యక్తిని కాదని, నెగిటివ్ మాటలు వినిపిస్తే, వాటిని తాను బలంగా సూచనగా తీసుకుంటానన్నారు. సినిమాపై బాయ్‌కాట్ అంటుంటే "చేసుకోండి" అని ధైర్యంగా సమాధానం ఇచ్చారు. ఆయన మాటల్లో తన నమ్మకం, భక్తి, ధైర్యం స్పష్టంగా కనిపించాయి.

  • Author : Sudheer Date : 25-07-2025 - 8:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Hhvm Sm
Pawan Hhvm Sm

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu ) సినిమా విడుదలకు ముందు నుంచే వివాదాల్లో నిలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది శ్రేణులు ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయగా, విడుదలైన వెంటనే గ్రాఫిక్స్, విజువల్స్‌పై నెగిటివ్ కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ విమర్శలు పవన్ దృష్టికి చేరాయి. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఈ అంశంపై ఆయన స్పందిస్తూ తీవ్ర విమర్శల మధ్య కూడా ధైర్యంగా నిలిచే తాను ఎప్పుడూ అభిమాని బలంతో ముందుకు సాగుతానని చెప్పారు.

విమర్శలతో తాను క్షీణించను అని స్పష్టం చేసిన పవన్ (Pawan), “నాకు డిప్రెషన్ ఉండదు… బ్రతకడం అంటేనే సక్సెస్” అని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ట్రోల్స్‌కు భయపడే వ్యక్తిని కాదని, నెగిటివ్ మాటలు వినిపిస్తే, వాటిని తాను బలంగా సూచనగా తీసుకుంటానన్నారు. సినిమాపై బాయ్‌కాట్ అంటుంటే “చేసుకోండి” అని ధైర్యంగా సమాధానం ఇచ్చారు. ఆయన మాటల్లో తన నమ్మకం, భక్తి, ధైర్యం స్పష్టంగా కనిపించాయి.

Non-veg Food: శ్రావ‌ణ మాసంలో నాన్ వెజ్ తిన‌కూడ‌దా? కార‌ణాలీవే?!

సినిమాలో వచ్చిన గ్రాఫిక్స్ విమర్శలపై కూడా పవన్ నిగూఢంగా స్పందించారు. “విజువల్స్ లో లోపాలుంటే వాటిని అంగీకరిస్తా, పార్ట్ 2లో తప్పక సరిచేస్తాం” అని చెప్పారు. టెక్నికల్ అంశాల్లో ఎప్పుడూ మెరుగుదలకే అవకాశం ఉందని ఆయన వివరించారు. అభిమానులు విమర్శలు ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉండాలని కోరారు. “మీరు తేలికగా ఉండండి, దెబ్బలు తినేది నేను కదా” అంటూ అభిమానులకు ధైర్యాన్ని నూరిపోశారు.

పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాను వ్యక్తిగతంగా తన గురించి కాదు, భారతీయ సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా అని స్పష్టం చేశారు. కోహినూర్ వజ్రం కన్నా గురువుల ద్వారా వచ్చిన జ్ఞానం మన సివిలైజేషన్‌కు అసలైన సంపద అని చెప్పారు. ఇది ఒక్కరు లేదా ఇద్దరిపై కాక, ఒక నాగరికతపై, ఓ దేశపు ధర్మ విశ్వాసాలపై తీసిన సినిమా అని అన్నారు. ‘‘నెగిటివ్ మాటలు వస్తే స్పందించండి, దమ్ముంటే తిరిగి కొట్టండి’’ అనే పవన్ వ్యాఖ్యలు అభిమానులకు కొత్త ఊరటనిచ్చాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hari hara veera mallu success meet
  • hari hara veera mallu talk
  • hari hara veera mallu VFX
  • Harihara Veera Mallu
  • Pawan Kalyan
  • Pawan Speech

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd