Millie Bobby Brown: 19 ఏళ్ల హాలీవుడ్ హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఆమె ఎవరో తెలుసా?
ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ట్యాగ్ she is 19. ఈ ట్యాగ్ ప్రపంచ వ్యాప్తంగా రెండు అవుతున్న విషయం
- By Nakshatra Published Date - 06:15 PM, Wed - 12 April 23
ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ట్యాగ్ she is 19. ఈ ట్యాగ్ ప్రపంచ వ్యాప్తంగా రెండు అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు మనకు ఈ ట్యాగ్ ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. కానీ చాలామందికి ఈ ట్యాగ్ ఏంటి అసలు ఎందుకు ట్రెండ్ అవుతుంది అన్న విషయం తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఆ ట్యాగ్ వెనుక ఒక శుభవార్త ఉంది. అదే పెళ్లి శుభవార్త. హాలీవుడ్ హీరోయిన్ హీరోయిన్ కు సంబంధించిన పెళ్లి శుభవార్త. హాలీవుడ్ లో గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ మాన్స్టర్స్, ఎనోలా హోమ్స్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ , ఎనోలా హోమ్స్ 2 లాంటి సినిమాలలో నటించి ప్రపంచవ్యాప్తంగా భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది హీరోయిన్ మిల్లి బాబీ బ్రౌన్.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో తన పెళ్లికి సంబంధించిన శుభవార్తను తెలిపింది. కాగా మిల్లి బాబి బ్రౌన్ గత రెండు ఏళ్లుగా పాపులర్ సింగర్ జోన్ బాన్ జోవీ కొడుకు అయిన అమెరికన్ యాక్టర్ జోక్ బొంగియోవి తో రిలేషన్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎప్పటికప్పుడు వెకేషన్ లు టూర్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 19 ఏళ్ల మిల్లి బాబి బ్రౌన్ చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ చాలా మంది కుర్రాల హృదయాలను ముక్కలు చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈమెకు యూత్ లో ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వారి వయస విషయంలోనే చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. మిల్లి బాబి వయసు 19 ఏళ్లు కాగా ఆమె బాయ్ ఫ్రెండ్ జేక్ వయసు 20 ఏళ్ళు. ఏజ్ లో ఎంగేజ్మెంట్ ఏంటి?అప్పుడే పెళ్లి ఏంటి అంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో she is 19 అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Related News
Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క
పోలింగ్‌కు ఒక్కరోజు ముందు నేను చనిపోతానేమోనని భయంగా ఉంది అంటూ బర్రెలక్క పోస్ట్ చేసింది. మరో గీతాంజలిలా నేనూ బలిపశువును అవుతానని భావిస్తున్నాను. మీ స్వంత ఆనందం కోసం మీరు చేసే వీడియోల ద్వారా ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది