Peter Hein : హీరోగా స్టార్ ఫైట్ మాస్టర్.. పాన్ ఇండియా సినిమాతో..
భారీ సినిమాలకు , స్టార్ హీరో సినిమాలకు ఫైట్ మాస్టర్(Fight Master) గా పనిచేసిన పీటర్ హెయిన్(Peter Hein) ఇప్పుడు హీరోగా మారబోతున్నారు.
- Author : News Desk
Date : 06-01-2024 - 8:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఇప్పుడు సినీ పరిశ్రమలలో హీరోలు(Hero) కూడా ఎక్కువే అవుతున్నారు. వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా నటులుగా మారుతున్నారు. సంగీత దర్శకులు, డ్యాన్సర్లు, నిర్మాతలు.. ఇలా అందరూ హీరోలు అయిపోతున్నారు ఈ మధ్య. తాజాగా స్టార్ ఫైట్ మాస్టర్ హీరోగా మారబోతున్నారు. బాహుబలి, మగధీర, RRR… ఇలా ఎన్నో భారీ సినిమాలకు , స్టార్ హీరో సినిమాలకు ఫైట్ మాస్టర్(Fight Master) గా పనిచేసిన పీటర్ హెయిన్(Peter Hein) ఇప్పుడు హీరోగా మారబోతున్నారు.
తమిళనాడుకి(Tamilanadu) చెందిన పీటర్ హెయిన్ తన ఫైట్స్ తో నేషనల్ గుర్తింపు తెచ్చుకొని అన్ని సినీ పరిశ్రమలలో స్టార్ ఫైట్ మాస్టర్ గా ఎదిగారు. బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఫైట్స్ లో ఎన్నోసార్లు గాయపడి, ఆపరేషన్స్ చేయించుకొని కూడా త్వరగా కోలుకొని వర్క్ లో బిజీ అయ్యేవాడు పీటర్ హెయిన్.
తాజాగా పీటర్ హెయిన్ ని హీరోగా పరిచయం చేస్తూ తమిళ నిర్మాతలు ఓ పాన్ ఇండియా సినిమాని ప్రకటించారు. ట్రెండ్స్ సినిమాస్ అధినేత జేఎం బషీర్, MT సినిమాస్ అధినేత ఏఎం చౌదరి నిర్మాతలుగా ఎం.వెట్రి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా నేడు ఉదయం ఈ సినిమా పూజ కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఇందులో పీటర్ హెయిన్ అటవీ వాసిగా నటించబోతున్నట్టు, అందుకు తగ్గ శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. మరి స్టార్ ఫైట్ మాస్టర్ హీరోగా చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలని ప్రకటిస్తారు. ఇక పీటర్ హెయిన్ గతంలోనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించాడు. ఇప్పుడు ఈ సినిమాతో హీరోగా ఏంట్రీ ఇవ్వబోతున్నాడు.
Also Read : Vijay Binni: నా సామిరంగ ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది: డైరెక్టర్ విజయ్ బిన్ని