Vijay Binni: నా సామిరంగ ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది: డైరెక్టర్ విజయ్ బిన్ని
- By Balu J Published Date - 08:08 PM, Sat - 6 January 24
సంక్రాంతి అంటే నాగార్జున.. నాగార్జున అంటే సంక్రాంతి. అందుకే నాగ్ ఈ పండుగకు వస్తున్నాడు. జనవరి14న ప్రపంచవ్యాప్తంగా నా సామిరంగ గ్రాండ్ విడుదల కానుంది. ఇతర సినిమాలు విడుదల అవుతున్నా నాగ్ మూవీ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ బిన్ని విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నాగార్జునతో వర్క్ ఎలా అనిపించింది?
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చూసిన తర్వాత అన్నీ క్రాఫ్ట్స్ బాగా చేశారు, కొరియోగ్రాఫర్ కి ఆ గ్రిప్ ఉంటుందని భావించి కొన్నాళ్ళు కొరియోగ్రఫీ వైపు వెళ్లాను. ఇంతకుముందు నాగార్జున గారికి పాటలు చేశాను. సినిమా కూడా చాలా హ్యాపీ గా చేసుకుంటూ వెళ్లాం. దర్శకుడిగా తొలి సినిమాని నాగార్జున గారితో చేయడం నా అదృష్టం
నాగ్ ను ఎలా ప్రజెంట్ చేశారు?
-ముందు నాగార్జున గారితో ఒక సినిమా చేయాలని ఆయనకి కథ చెప్పాను. అప్పుడు ఆయన ఈ కథ గురించి చెప్పి ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఈ కథని వోన్ చేసుకొని నా స్టయిల్ లో చేశాను. ఈ సినిమాలో చాలా హైస్ వుంటాయి. వింటేజ్ నాగార్జున గారు కనిపిస్తారు. నేను నాగార్జున గారిని ఎంత డిఫరెంట్ గా చూపించాలని అనుకున్నానో అంత కొత్తగా ప్రజెంట్ చేశానని భావిస్తున్నాను.
ఈ సినిమా నేపధ్యం ఏమిటి ?
-స్నేహం, మంచి ప్రేమకథ, చాలా మంచి ఎమోషన్ వుంటాయి. 80-90 మధ్య కాలంలో జరిగే కథ ఇది.
అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రల గురించి ?
-ఇదొక ఫ్రెండ్షిప్ మూవీ. నరేష్ గారికి నాగార్జున గారంటే పిచ్చి. వారిద్దరిని ఈ కథలో పెడితే బావుంటుందనిపించింది. నరేష్ గారు అద్భుతంగా చేశారు, వీరితో పాటు మరో యంగ్ యాక్టర్ వుండాలి. ఆ పాత్రకు రాజ్ తరుణ్ ని తీసుకున్నాం. ఇందులో ముగ్గురికి ఒకొక్క కథ వుంటుంది. ఈ కథలు ఎలా కనెక్ట్ అయి వున్నాయి? వాళ్ళ మధ్య జరిగిన సిస్ట్యువేషన్స్ ఏమిటనేది చాలా కొత్తగా వుంటాయి.
కిరవాణితో పనిచేయడం ఎలా ఉంది
-కీరవాణి గారు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ కొత్త దర్శకుడిలా చూడలేదు. నేను కోరియోగ్రఫర్ ని కాబట్టి మ్యూజిక్ సెన్స్ వుంటుంది. ఆయనకి ఏదైనా చెప్పినా ఒక సెన్స్ తోనే చెబుతుంటాడని భావించేవారు. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. ఇప్పటివరకూ వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. రాబోయే మూడు పాటలు కూడా వైరల్ అవుతాయి.
ఈ సినిమా కోసం చాలా ఫాస్ట్ గా పని చేశారు కదా.. ఎక్కడ ఒత్తిడి అనిపించలేదా ?
-డైరెక్టర్ కావడం నా డ్రీం. ఆ డ్రీం కోసం చాలా కష్టపడ్డాను. సరైన సమయంలో ఈ చిత్రం వచ్చింది. దీనికి నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. కమర్షియల్ లోనే నా సొంత స్టైల్ ని ప్రయత్నించాను. అది ఖచ్చితంగా యూనిక్ గా వుంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుంది.
Related News
Sabari: ‘శబరి’ టైటిల్ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం అదే – దర్శకుడు అనిల్ కాట్జ్ ఇంటర్వ్యూ
Sabari: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కా�