Nayanthara : అర్ధరాత్రి రోడ్డుపై అలాంటి పని చేస్తున్న నయనతార.. వీడియో వైరల్!
- Author : Sailaja Reddy
Date : 05-04-2024 - 6:40 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన నయనతార ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఒకవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తోంది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. నయనతార దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అంతే కాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతోంది.
We’re now on WhatsApp. Click to Join
ఇకపోతే నయనతార కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తన పిల్లలు ఉయర్, ఉలగ్ లతో మదర్ హుడ్ ని మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది.
— Nayanthara✨ (@NayantharaU) April 4, 2024
ఇక ఆ ఫ్యామిలీ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా నయనతార ఒక వీడియోని షేర్ చేసారు. ఆ వీడియోలో నయన్ తో పాటు మరో ఇద్దరు కూడా కనిపించారు.
Read Also: Dil Raju: రెండో పెళ్లిపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన దిల్ రాజు.. అవి చూసి నా భార్య అలా?
అర్ధరాత్రి రోడ్డు సైడ్ ఐస్ క్రీమ్ తింటూ లేట్ నైట్ ఎంజాయ్ చేస్తూ ఒక సామాన్య వ్యక్తుల ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని ఆమె భర్త విగ్నేష్ రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Rashmika-Vijay: విజయ్ దేవరకొండలో నాకు నచ్చేవి నచ్చని క్వాలిటీస్ అవే : రష్మిక