HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ssmb29 Priyanka Chopra As Mandakini

Priyanka Chopra: ఎస్ఎస్ఎంబీ 29.. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదల!

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇప్పటికే విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ 'కుంభ' లుక్‌ను విడుదల చేశారు.

  • Author : Gopichand Date : 12-11-2025 - 8:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Priyanka Chopra
Priyanka Chopra

Priyanka Chopra: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ చిత్రం (తాత్కాలికంగా ‘గ్లోబ్‌ట్రాటర్’ లేదా ‘SSMB 29’ గా పిలుస్తున్నారు) నుండి తొలి ప్రధాన పాత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పోషిస్తున్న ‘మందాకిని’ పాత్ర లుక్‌ను బుధవారం సాయంత్రం మేకర్స్ విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.

రాజమౌళి ట్వీట్‌

ఈ పోస్టర్‌ను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న దర్శకుడు రాజమౌళి.. ప్రియాంక చోప్రాను అభినందిస్తూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. “ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ. దేశీ గర్ల్‌కు తిరిగి స్వాగతం! మందాకిని అనేక షేడ్స్‌ను ప్రపంచం వీక్షించడానికి వేచి ఉండలేకపోతున్నాను” అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

Also Read: IPL 2026 Retention: ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్.. ఏ రోజు, ఎక్కడ లైవ్ చూడాలి?

The woman who redefined Indian Cinema on the global stage. Welcome back, Desi Girl! @priyankachopra

Can’t wait for the world to witness your myriad shades of MANDAKINI.#GlobeTrotter pic.twitter.com/br4APC6Tb1

— rajamouli ss (@ssrajamouli) November 12, 2025

ప్రియాంక చోప్రా సైతం తన పాత్రను వర్ణిస్తూ.. “ఆమె కంటికి కనిపించే దానికంటే ఎక్కువే… మందాకినిని పలకరించండి” అని పోస్టర్‌ను పంచుకున్నారు. మహేష్ బాబు కూడా ఈ లుక్‌ను షేర్ చేస్తూ “ఇప్పుడు ఆమె వచ్చింది… మందాకినిని కలవండి” అని తెలిపారు.

క్లిఫ్ ఎడ్జ్‌లో చీర కట్టి గన్ ఫైర్!

ప్రియాంక ఫస్ట్ లుక్ కమర్షియల్ సినిమాల్లోని సాధారణ హీరోయిన్ పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంది. ఫస్ట్ లుక్‌లో ఆమె ప్రకాశవంతమైన పసుపు రంగు చీర ధరించి, ఒక కొండ అంచున ఉంది. అక్కడ ఆమె తన సమతుల్యతను కాపాడుకుంటూ గురి తప్పని తుపాకీతో కాల్పులు జరుపుతున్న పవర్-ప్యాక్డ్ యాక్షన్ సీన్‌లో కనిపించింది. ఈ స్టీరియోటైప్ లేని లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రియాంక యాక్షన్ అవతార్‌ను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ‘బాక్స్ ఆఫీస్ సునామీ’, ‘దేశీ పవర్’ అంటూ కామెంట్లు, ఫైర్ ఎమోజీలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టైటిల్ రివీల్‌పై అంచనాలు

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇప్పటికే విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ ‘కుంభ’ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్ర టైటిల్‌ను నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే భారీ ఈవెంట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ వేడుక జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mahesh babu
  • Mandakini
  • Prithviraj Sukumaran
  • priyanka chopra
  • ss rajamouli
  • SSMB29

Related News

    Latest News

    • దేశం మెచ్చిన నాయకత్వానికి చిరస్థాయి గౌరవం : సీఎం చంద్రబాబు

    • నీ నోరు కంపు సీఎం స్థాయికి తగదు: రేవంత్ రెడ్డి పై జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

    • వాజ్‌పేయి జయంతి వేళ ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు ప్రారంభం !

    • భద్రతా బలగాల కాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి

    • ఇక పై చాట్‌జీపీటీలోనూ వాణిజ్య ప్రకటనలు!

    Trending News

      • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

      • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

      • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

      • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

      • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd