SSMB29.. ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
SSMB29 ప్రియాంక చోప్రా మహేష్ సినిమా కోసం 20 కోట్ల దాకా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీ కోసం మహేష్ ఇప్పటికే పూర్తిస్థాయిలో
- By Ramesh Published Date - 01:15 PM, Wed - 29 January 25

SSMB29 సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఐతే సినిమా ప్రొడక్షన్ లో హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా భాగస్వామ్యం అవుతుందని తెలుస్తుంది. దశాబ్ధ కాలం తర్వాత ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమాకు సైన్ చేసింది.
ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే రాజమౌళి వర్క్ షాప్ మొదలు పెట్టాడు. ఈ సినిమాకు ప్రియాంకా చోప్రాకి సంబందించిన బల్క్ డేట్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో నటించేందుకు గాను ప్రియాంక భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.
హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తక్కువ కాకుండా..
ప్రియాంక చోప్రా మహేష్ సినిమా కోసం 20 కోట్ల దాకా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీ కోసం మహేష్ ఇప్పటికే పూర్తిస్థాయిలో మేకోవర్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మిగిలిన కాస్ట్ ఎవరు. త్వరలో రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్న ఈ సినిమా రెండేళ్లలో పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు జక్కన్న.
ప్రియాంక చోప్రా ఉంది కాబట్టి ఈ సినిమా హాలీవుడ్ లో కూడా భారీగా వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ లో అదరగొట్టిన రాజమౌళి. రాబోతున్న మహేష్ సినిమాతో అకడమీ అవార్డ్ పై కన్నేసినట్టు తెలుస్తుంది.
Also Read : Samyuktha : సంయుక్తకి బాలయ్య ఛాన్స్.. అలా వచ్చిందా..?