Baahubali 3: ‘బాహుబలి’ ప్రపంచం ఎప్పటికీ అంతం కాదు!
బాహుబలి సిరీస్ ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. తద్వారా పాన్ ఇండియా చిత్రాలకు కూడా మార్గం సుగమం చేసింది.
- By Balu J Published Date - 03:19 PM, Mon - 14 March 22
బాహుబలి సిరీస్ ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. తద్వారా పాన్ ఇండియా చిత్రాలకు కూడా మార్గం సుగమం చేసింది. ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రూ. 1000 కోట్లు. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ఇద్దరికీ ఎంతో పేరొచ్చింది. బాహుబలి2 2017 లో విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం మూడవ భాగం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాధే శ్యామ్ ప్రమోషన్ సందర్భంగా బాహుబలి ప్రపంచం ఎప్పటికీ అంతం కాదు అని ప్రభాస్ చెప్పాడు.
రాధే శ్యామ్ కోసం మీడియా ఇంటరాక్షన్స్ సందర్భంగా.. బాహుబలి మూడో భాగం ఉండబోతుందా అనే ప్రశ్నకు.. “బాహుబలి అనేది నేను ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉండే సినిమా. అది నా కెరీర్‌పై ప్రభావం చూపింది. బాహుబలి 3 వస్తుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ నేను ఖచ్చితంగా చేయగలను. రాజమౌళి కోరుకుంటేనే అది జరుగుతుంది’’ అని అన్నారు ప్రభాస్. అమరేంద్ర బాహుబలి, అతని కొడుకు శివుడు పాత్రలో ప్రభాస్ నటించాడు. రెండు భాగాల యాక్షన్-డ్రామాలో అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రానా దగ్గుబాటి, రమ్య కృష్ణన్ తదితరులు కూడా నటించారు. బాహుబలి1, బాహుబలి2 సిరీస్ లు రెండు సక్సెస్ కావడంతో అభిమానులతోపాటు టాలీవుడ్ కూడా మూడో పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టును జక్కన ఎప్పుడు టేక్ వోర్ చేస్తాడో చూడాలి మరి.
Related News
Kalki 2898 AD : ‘కల్కి’ నుంచి బుజ్జి ప్రోమో వచ్చేసింది.. నీ టైం స్టార్ట్ అయ్యింది బుజ్జి..
బుజ్జి అనే ముఖ్యమైన వాడిని పరిచయం చేస్తానంటూ ప్రభాస్ ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేసారు. నేడు ఆ బుజ్జిని అందరికి ముందుకు తీసుకు వచ్చేసారు.