Rashmika Srivalli 2.O : శ్రీవల్లి సెకండ్ వెర్షన్.. పిచ్చెక్కించేస్తుందా..?
Rashmika Srivalli 2.O కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక త్వరలో పుష్ప 2
- Author : Ramesh
Date : 14-04-2024 - 7:47 IST
Published By : Hashtagu Telugu Desk
Rashmika Srivalli 2.O కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక త్వరలో పుష్ప 2 తో మరో సెన్సేషన్ కు రెడీ అవుతుంది. పుష్ప 2 నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచుతుండగా రష్మిక మందన్న కూడా వాటిని డబుల్ చేసేలా కామెంట్స్ చేస్తుంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పుష్ప 2 గురించి మాట్లాడిన రష్మిక ఇందులో శ్రీవల్లి 2.O చూస్తారని అన్నది.
అంటే శ్రీవల్లి సెకండ్ వెర్షన్ చూడబోతున్నారని రష్మిక చెప్పుకొచ్చింది. పుష్ప లో ఛాన్స్ రాగానే తన పాత్ర.. దాన్ని ఎలా తీస్తారా అన్న డౌట్ వచ్చిందని. కానీ సినిమాను తెర మీద చూపిస్తున్నప్పుడు తనని తాను మర్చిపోయానని అన్నది రష్మిక. ఇక పుష్ప 1 కన్నా పుష్ప 2 చాలా పెద్దగా ఉంటుంది. శ్రీవల్లి మాత్రం అదరగొట్టేస్తుందని అన్నది.
పుష్ప 1 అంచనాలను దాటి పుష్ప 2 అందుకునేలా సుకుమార్ చాలా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే రోజు వచ్చిన టీజర్ కూడా సినిమా ను నెక్స్ట్ లెవెల్ లో ఊహించుకునేలా చేసింది. రష్మిక చెబుతున్న ఈ మాటలు వింటుంటే పుష్ప 2 పై మరింత హైప్ ఏర్పడుతుంది.
పుష్ప 2 తో పాటుగా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాగా వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
Also Read : Krithi Shetty : బేబమ్మ ఆఫర్ ను దర్శక నిర్మాతలు వాడుకుంటారా..?