Krithi Shetty : బేబమ్మ ఆఫర్ ను దర్శక నిర్మాతలు వాడుకుంటారా..?
Krithi Shetty ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ సినిమా హిట్ తో వరుస ఛాన్సులు అందుకుంది. దాదాపు 8 సినిమాల దాకా వెనక్కి చూడకుండా
- By Ramesh Published Date - 07:34 PM, Sun - 14 April 24
Krithi Shetty ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ సినిమా హిట్ తో వరుస ఛాన్సులు అందుకుంది. దాదాపు 8 సినిమాల దాకా వెనక్కి చూడకుండా చేస్తూ వచ్చిన కృతి శెట్టి వాటి ఫలితాలను కూడా పట్టించుకునే తీరిక దొరకలేదు. ఫైనల్ గా చూస్తే మొదటి సినిమాతో కెరీర్ ఎలా అయితే పీక్స్ లోకి వెళ్లిందో వరుస ఫ్లాపులు ఆమె గ్రాఫ్ పడిపోయేలా చేసింది. లాస్ట్ ఇయర్ వచ్చిన నాగ చైతన్య కస్టడీ సినిమా వర్క్ అవుట్ కాకపోవడంతో ఆమెను పక్కన పెట్టారు దర్శక నిర్మాతలు.
మళ్లీ తిరిగి ఎలాగైనా ఛాన్సులు రాబట్టుకోవాలని కృతి శెట్టి చేయని ప్రయత్నం లేదని చెప్పాలి. అయితే శర్వానంద్ నటిస్తున్న మనమే సినిమాలో ఛాన్స్ అందుకున్న కృతి శెట్టి ఆ సినిమా తో పాటుగా మలయాళంలో టోవినో థామస్ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుంది. ప్రస్తుతం బేబమ్మ చేతిలో ఈ రెండు సినిమాలే ఉన్నాయి.
ఇక ఇదిలాఉంటే అవకాశాల కోసం ఇప్పటికే ఫోటో షూట్స్ తో గ్లామర్ డోస్ పెంచేస్తున్న అమ్మడు అవసరం అయితే రెమ్యునరేషన్ కూడా తగ్గిస్తానని అంటుంది. ఉప్పెన హిట్ తో కోటి దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన కృతి శెట్టి ఆ తర్వాత కోటిన్నర దాకా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా ఛాన్స్ ఇస్తే చాలు రెమ్యునరేషన్ తర్వాత సంగతి అనేలా చెబుతుందట.
కెరీర్ లో పీక్స్ కి వెళ్లిన కృతి శెట్టి ప్రస్తుతం తనను టాలీవుడ్ లో పట్టించుకోకపోవడం పట్ల అసంతృప్తిగా ఉంది. అందుకే ఎలాగైనా ఛాన్సులు రాబట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. శర్వానంద్ తో చేస్తున్న మనమే హిట్ అయితే బేబమ్మ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.
Also Read : Meenakshi Chaudhary : గురూజీ గుర్తించాక ఆఫర్లు తన్నుకుంటూ రావాల్సిందే.. ఏకంగా వెంకటేష్ సరసన ఛాన్స్..!
Related News
Rajasekhar : ఫాదర్ రోల్ లో రాజశేఖర్.. ఈసారైనా లక్ కలిసి వచ్చేనా..?
Rajasekhar ఒకప్పుడు తన సినిమాలతో అలరించి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా క్రేజ్ తెచ్చుకున్న రాజశేఖర్ ఇప్పుడు పూర్తిగా ఫాం కోల్పోయారని చెప్పొచ్చు. సీనియర్ హీరోల్లో తనకంటూ ఒక మార్క్ ఉన్నా